Breaking News

విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేద్దాం

-విజయవాడ ఉత్సవ్” ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్, సుంకర అనిల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ ఉత్సవ్ ను అందరి సహకారంతో విజయవంతం చేద్దామని విజయవాడ ఉత్సవ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ , ప్రముఖ నిర్మాత సుంకర అనిల్ అన్నారు. విజయవాడలో దసరా ఉత్సవాల సందర్భంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆదివారం భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి విజయవాడ ఉత్సవ్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సుంకర అనిల్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
దేశం గర్వపడేలా, ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా అత్యంత వైభవంగా సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ మరియు శ్రేయాస్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించనున్న విజయవాడ ఉత్సవ్ లో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా దాండియా ఈవెంట్, ప్రదర్శనలు , ప్రముఖ సినీ నేపద్య గాయకులు, జానపద కళాకారుల ప్రదర్శనలు , సాంస్కృతిక మరియు భక్తి కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. అందరి సహకారంతో విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేద్దాం అని ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సుంకర అనిల్ తెలిపారు

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, కార్పొరేటర్ బుల్లా విజయ్ కుమార్ , సోలంకి రాజు, కొంపెళ్ళ శ్రీనివాస్, పీ వీ చిన సుబ్బయ్య,నున్న కృష్ణ, ప్రవీణ్ రాంకా , అవ్వారు బుల్లబ్బాయి, భావి శెట్టి శ్రీనివాస్,డాక్టర్ రమ్య, రౌతు రమ్యప్రియ, తిరుపతి అనూష,కుసుమ్ దోషి,ఇన్నర్ వీల్ క్లబ్ సన్ షైన్ అధ్యక్షురాలు భభిత జైన్, సెక్రటరీ టీ సుజాత తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *