-ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని)
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దసరా ఉత్సవాల సందర్భంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న ప్రపంచంలోనే అతిపెద్ద ఫెస్టివల్ కార్నివల్, “విజయవాడ ఉత్సవ్” ను ప్రతి ఒక్కరూ ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ (చిన్ని) పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ” సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ” సారధ్యంలో 11 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. విజయవాడ ఉత్సవ్ ను విజయవంతం చేద్దామని భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో కూటమి నేతలతో కలిసి ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని )సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , ఏపీ ఆర్యవైశ్య మహాసభ గౌరవాధ్యక్షులు పెనుగొండ సుబ్బారాయుడు, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ముత్తవరపు మురళి, బొప్పన భవ కుమార్, ఫతావుల్లా , సోలంకి రాజు,కోగంటి రామారావు, కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు కూటమినేతలు పాల్గొన్నారు
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్( చిన్ని) మాట్లాడుతూ సాంస్కృతిక మరియు భక్తి కార్యక్రమాలతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా విజయవాడ ఉత్సవ్ ను నిర్వహిస్తున్నామన్నారు.
పున్నమి ఘాట్, తుమ్మలపల్లి కళాక్షేత్రం, గొల్లపూడి లోని ఎగ్జిబిషన్ మైదానం, ఘంటసాల సంగీత కళాశాల, ఇందిరాగాంధీ స్టేడియం తదితర ప్రాంతాల్లో సినీ, సంగీత, సాంస్కృతిక, క్రీడలకు సంబంధించిన కార్యక్రమాలను నిరంతరాయంగా 11 రోజులు పాటు నిర్వహించే విధంగా ప్రణాళికలను రూపొందించినట్లు తెలిపారు.
విజయవాడకు పునర్వైభవం తీసుకువచ్చి , దసరా అంటే విజయవాడ వెళ్లాలనిపించేలా దేశం మొత్తం విజయవాడ వైపు చూసేలా మైసూర్ తరహాలో విజయవాడ ఉత్సవ్ ను నిర్వహిస్తున్నామన్నారు.
ఈ ఉత్సవ్ కు ఉపరాష్ట్రపతి రాధా కృష్ణన్,మాజీ ఉపరాష్ట్ర పతి వెంకయ్య నాయుడు తో పాటు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్, విద్య ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, ఇంచార్జ్ మంత్రి సత్య కుమార్ యాదవ్ , మాజీ కేంద్ర మంత్రి వర్యులు ఎమ్మెల్యే సుజనా చౌదరి, కృష్ణా , ఎన్టీఆర్ జిల్లాల ఎమ్మెల్యేలతో పాటు దేశం నలుమూలల నుంచి అతిరథ మహారధులందరిని ఆహ్వానించామన్నారు.
కళాకారులకు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వామ్యం కల్పిస్తామని ప్రతిభ కలిగి, ఆసక్తి ఉన్న కళాకారులు పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ను కలవాలని ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని )తెలిపారు.
అమ్మవారి అనుగ్రహం , ఆశీస్సులతో విజయవాడ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పేలా ప్రపంచ రికార్డు సాధించే దిశగా విజయవాడకు పునర్వైభవం తెచ్చేలా నిర్వహిస్తున్న ఈ విజయవాడ ఉత్సవ్ ను సమిష్టి గా విజయవంతం చేద్దామని ఎంపీ కేశినేని శివనాథ్ ( చిన్ని) పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎన్డీఏ కూటమి నేతలు అబ్దుల్ ఖాదర్, ఫతావుల్లా, యేదుపాటి రామయ్య, అలుగుండ్ల సుబ్బారెడ్డి, పత్తి నాగేశ్వరరావు, పీ వీ చిన సుబ్బయ్య,సంతోష్ కుమార్, తిరుపతి అనూష, తిరుపతి సురేష్, రౌతు రమ్య ప్రియ,మల్లెపు విజయలక్ష్మి , రేగళ్ల లక్ష్మణరావు, సురభి బాలు, గుండారపు హరిబాబు,మంగళపురి మహేష్, పత్సవ మల్లికార్జున, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News