గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఆదేశాల మేరకు విస్తృతంగా మినరల్ వాటర్ ప్లాంట్ లో శాంపిల్స్ సేకరించి టెస్టింగ్ నిమిత్తం ల్యాబ్ కు పంపామని, డయేరియా కేసులు నమోదు అయిన మరియు అనుమానిత ప్రాంతాల్లో నగరపాలక సంస్థ నుంచి ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా త్రాగునీటి సరఫరా చేస్తున్నామని, కేసులు నమోదైన ప్రాంతాల్లో ఇంటింటిలో క్లోరిన్ శ్యాంపిల్ సర్వే చేస్తున్నామని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ గుంటూరు నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న కారణంగా నగర ప్రజలు జిఎంసి సరఫరా చేయు త్రాగునీటిని కేవలం వారి ప్రాంతానికి నిర్దేశించిన సరఫరా సమయంలోనే పట్టుకొని కాచి చల్లార్చి త్రాగాలని సూచించారు. గత 10 రోజుల నుండి ప్రతి వార్డ్‌లో 20కి తగ్గకుంటా క్లోరిన్ పరీక్షలు చేయటం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు డయేరియాపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మొబైల్ వాహనాల ద్వారా తెలియచేస్తున్నామన్నారు. డ్రైన్ క్రాసింగ్ ఉన్న ట్యాప్ లను తొలగించాలని ఏఈలు, ఎమినిటి కార్యదర్శులను ఆదేశించామని తెలిపారు. తుఫాన్ నగర్, నల్లచెరువు వంటి ప్రాంతాల్లో వర్షం వల్ల నిలిచిన వెంటనే మోటార్ల ద్వారా బేయిల్ అవుట్ చేసామన్నారు. కంకరగుంట ఆర్యూబి, 3 వంతెనల వద్ద వర్షం పడిన వెంటనే యుద్దప్రాతిపదికన నీటిని తొలగించి, వాహనాల రాకపోకలకు వీలుగా బెయిల్ అవుట్ చేస్తున్నామన్నారు.
Prajavartha Online Telugu News