Breaking News

రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం అధికారులు 3 రోజుల పర్యటన…

-లంకా దినకర్, ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు ఛైర్మెన్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
6 అక్టోబర్ 2025 న రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం అధికారులు ఆంధ్రప్రదేశ్ లో అమలు జరుగుతున్న సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాల పరిశీలన కోసం 3 రోజుల పర్యటనకు వస్తున్నారు.

పర్యటనలో ఆంధ్రప్రదేశ్ ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మెన్ లంకా దినకర్ మరియు రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు రాజధాని అమరావతి నిర్మాణం, జల్ జీవన్ మిషన్ మరియు అమృత్ పథకాల అమలు, పోలవరం ప్రాజెక్టు పురోగతి, నదుల అనుసంధానం, పీ4 అమలు, సూపర్ సిక్స్, అన్న క్యాంటీన్లు , వాహన మిత్ర అమలు మరియు ఇతర సంక్షేమ పథకాల అమలు, అభివృద్ధి సూచికల ఫలితాలు మరియు రాష్ట్ర ప్రభుత్వ పరిపాలనలో సాంకేతిక అంశాలు పైన 6 వ తేదీ ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు సచివాలయంలోని రెండవ బ్లాక్ లోని మొదటి అంతస్తులోని కాన్ఫరెన్స్ హాల్ నందు జరుగును, అనంతరం మధ్యాహ్నం 1 గంటకు విలేకరుల సమావేశం నిర్వహించి ఈ సమావేశంలో చర్చించిన అంశాలను తెలియజేయడం జరుగుతుంది.

సమావేశం అనంతరం 6 మరియు 7 తేదీలలో రాజస్థాన్ ప్రణాళిక అధికారులు ఎన్టీఆర్ జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ సెంటర్, రాజధాని అమరావతి నిర్మాణం పనులు, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పనితీరులను పరిశీలించడానికి క్షేత్ర స్థాయిలో మన రాష్ట్ర ప్రభుత్వ అధికారుల సమన్వయంతో పర్యటిస్తారు.

జూలై 16 మరియు 17 తేదీలలో మన రాష్ట్రం నుండి ఇరవై సూత్రాల కార్యక్రమాల అమలు చైర్మెన్ లంకా దినకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక శాఖ అధికారులు రాజస్థాన్ లో పర్యటించి అక్కడ అధికారులతో సమావేశం అయిన సంగతి విదితమే, నాటి రాజస్థాన్ పర్యటనలో పరిశీలించిన ముఖ్యమైన వివరాలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి లంకా దినకర్ నివేదిక అందించారు.

ఇప్పుడు అదే విధంగా రాజస్థాన్ నుండి అధికారులు మన రాష్ట్రా పర్యటనకు వస్తున్నారు. ఇటువంటి పర్యటనల వల్ల వివిధ రాష్ట్రాల మధ్య సుపరిపాలన విధానాల అవగాహనకు ఆస్కారం ఏర్పడుతుందని లంకా దినకర్ అభిప్రాయపడ్డారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

బొండా సిద్ధార్థకు మేయర్‌గా అవకాశం కల్పించాలి బ్రాహ్మణ సంఘాల ఆధ్వర్యంలో తీర్మానం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : 33వ డివిజన్ సత్యనారాయణ పురం డివిజన్ కార్యాలయం నందు బుధవారం తెలుగుదేశం పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *