విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బీజేపీ మాత్రమే ప్రజలకు నిజమైన సేవ చేసే పార్టీ” అని, అందుకే బీజేపీలోకి చేరుతున్నారని బీజేపీ కృష్ణాజిల్లా అధ్యక్షులు తాతినేని శ్రీరామ్ అన్నారు. ఆదివారం బీజేపీ రాష్ట్ర మీడియా ఇంచార్జి కిలారు దిలీప్ స్వగృహంలో పెనమలూరు నియోజకవర్గానికి చెందిన తాళ్ళ నరేంద్ర, షేక్ చిన్నా బీజేపీ సిద్ధాంతాలకు ఆకర్షితులై అధికారికంగా భారతీయ జనతా పార్టీలో చేరారు. తాళ్ళ నరేంద్ర గతంలో వివిధ పార్టీల్లో చురుకుగా పనిచేశారు. అదేవిధంగా షేక్ చిన్నా 25 ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేసి, బీజేపీ కండువా కప్పుకున్నారు. వీరి సమక్షంలో 50 మందితో బీజేపీ కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర మైనారిటీ మోర్చా అధ్యక్షులు సయ్యద్ బాషా, బీజేపీ సీనియర్ నాయకులూ వల్లూరి శ్రీమన్నారాయణ, దుర్గా ప్రసాద్, మోర్ల మహీధర్, మరీదు రమేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News