విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఈ నెలలో పెన్షన్ పంపిణి ఉదయం 10 గంటల తరువాత పంపిణి చేసే ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని గ్రామ వార్డు సచివాలయం డైరెక్టర్ సంభంధిత కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వడన్ని సచివాలయం ఉద్యోగుల హక్కుల సాధన కమిటీ తరుపున ఖండిస్తున్నామని, ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి చైర్మన్ కె. షాలేమ్ కృపా వెస్లీ అన్నారు. శనివారం విజయవాడలోని ప్రెస్ క్లబ్లో సచివాలయ ఉద్యోగుల ఆందోళనలు ప్రభుత్వ తీరు తదుపరి కార్యాచరణ పై మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్రంలోని 20కి పైగా సచివాలయ ఉద్యోగ సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ కొనసాగించడానికి సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన కమిటీ పేరుతో నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. నూతన కమిటీగా ఆంధ్రప్రదేశ్ గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగుల హక్కుల సాధన సమితి చైర్మన్ కె షాలేమ్ కృపా వెస్లీ, గౌరవ చైర్మన్ వలమాల శ్రీనివాసరావు, అసోసియేట్ చైర్మన్ తోటకూర కోటేశ్వరరావు, కార్యదర్శి జి.రాజ్యలక్ష్మి, కన్వీనర్ కె ప్రభాకర్ రావు, అసోసియేట్ కన్వీనర్ చాట్ల సురేష్, ఆర్గనైసింగ్ సెక్రటరీ గుడి నాగరాజు, కో-చైర్మన్ అన్నపూర్ణాచారి, సత్యనారాయణ, సభ్యులు అలీ అక్బర్, ఫణీంద్ర మనోహర్, సుధాకర్, యోన తదితరులను ఎన్నుకున్నారు.
Prajavartha Online Telugu News