విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విద్యుత్ ఉద్యోగులు, కార్మికులు, కాంట్రాక్టు కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈనెల 13వ తేదీన ధర్నాచౌక్‌లో మహా ధర్నా, ఈనెల 15వ తేదీ నుండి నిరవధిక సమ్మె చేయనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జెఏసి చైర్మన్ కృష్ణయ్య అన్నారు. గుణదలలోని ఉద్యోగుల అసోసియేషన్. కార్యాలయంనందు శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుమారుగా 60 వేల మంది పైబడి సమ్మెబాట పట్టనున్నారని, దీని వలన సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉందని అన్నారు. ఎక్కడైనా కరెంటు సమస్యలు తలెత్తితే వెంటనే హాజరు కాకపోవడం వలన సామాన్య ప్రజలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయి అని తెలిపారు. బ్రేక్ డౌన్ 400, 220,132, 33, 11 కేవీ మరియు ఎల్టి సర్వీస్‌లకు ఏర్పడితే ఉద్యోగులు కార్మికులు అందుబాటులో లేకపోతే గంటల తరబడి కానీ లేకపోతే రోజుల తరబడి కానీ మరమ్మతులు చేసేవారు ఉండరు పనులన్నీ కూడా ఆగిపోతాయి అని తెలిపారు. దానివలన పరిశ్రమలకు, వ్యాపార సంస్థలకు, హాస్పిటల్స్‌కు, రైతులకు, సాఫ్ట్వేర్ ఉద్యోగులకు, గవర్నమెంట్ ఆఫీసులకు ఈ సమ్మె ప్రభావం ఏర్పడబోతోంది అని తెలిపారు. అదే మాదిరిగా ఉత్పత్తి కేంద్రాలలో సమ్మె వలన ఉత్పత్తి ఆగిపోవడం వలన బయట నుండి ఎక్కువ ధర చెల్లించి కొనవలసి వస్తుందని అన్నారు. కాబట్టి వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News