-హిందుస్థాన్ ఏకో ప్రొడక్ట్స్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పర్యావరణహిత ప్లాస్టిక్ ను పునర్వినియోగించడం ద్వారా వనరుల సంరక్షించబడతాయని మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే (సుజనా చౌదరి) అన్నారు. శనివారం ఎనికేపాడు ,న్యూ ఆటోనగర్ లోని హిందుస్థాన్ ఏకో ప్రొడక్ట్స్ ను స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి రామ్, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా తో కలిసి ఎమ్మెల్యే సుజనా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా మాట్లాడుతూ సింగిల్ యూస్డ్ ప్లాస్టిక్ ను వాడకుండా వాటి స్థానంలో బయో కంపోస్టబుల్ ఏకో ప్రొడక్ట్స్ ను తయారుచేయడం శుభ పరిణామం అన్నారు. భవిష్యత్ తరాలకు చక్కటి పర్యావరణాన్ని అందించేందుకు కృషి చేస్తూ వ్యాపారాన్ని ప్రారంభించిన ఏకో ప్రొడక్ట్స్ లాభాల బాటలో పయనించాలని ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆకాంక్షించారు. ఏకో ప్రొడక్ట్స్ యాజమాన్యం మొరం సత్య సాయి ప్రసాద్,అడ్డూరి ఆకాష్, నందం సాయి కృష్ణ , ఫిటాన్స్ పరిశ్రమ లను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ కూటమి నేతలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News