Breaking News

ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలి…  

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అధికారంలో వచ్చిన వెంటనే రెగ్యులర్ ఉపాధ్యాయులగా చేస్తామని అనాడు నేటి కూటమి నాయకులు హామీ ఇచ్చారు కాని ఇంతవరకు అమలుకు చర్యలు తీసుకొలేదని 1998 ఎమిటిఎస్ ఉపాధ్యాయుల అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బైరెడ్డి శ్రీనివాస్ రెడ్డి అవేదన వ్యక్తం చేశారు. శనివారం దర్నాచౌక్ వద్ద నిర్వహించిన డీఎస్సీ 1998 ఉపాధ్యాయుల నిరసన కార్యక్రమంలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సార్లు రెగ్యులర్ చేయాలని అధికారులను కలసి వినతి పత్రాలు ఇవ్వటం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మంత్రి లోకేష్ను కలసి విజ్ఞప్తి చేసినా ప్రయోజనం కలగలేదన్నారు. తాము 20 సం.లుగా కాంట్రాక్టు ఉద్యోగస్తులుగా పని చేస్తూ అతి తక్కువ వేతనాలతో జీవీస్తున్నామన్నారు. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని అమలు చేయాలని మాత్రమే కోరుతున్నామన్నారు. ఉద్యోగుల కాలపరిమితి వయస్సు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాలకి పొడిగించాలన్నారు. ఏడాదికి 11 నెలల జీతం మాత్రమే ఇస్తున్నారు, ఒక నెల సెలవు, నెల జీతం కూడా కలిపి 12 నెలల జీతం ఇవ్వాలనీ, 4072 మంది ఉపాధ్యాయుల్లో రిటైర్మెంట్ పొందిన వారికి మినిమం 20 వేల పెన్షన్, అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం అన్నారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ కామేష్ రెడ్డి, ట్రెజరర్ ఎస్.శాస్త్రి, వర్కింగ్ ప్రెసిడెంట్ బాలిరెడ్డి, కమిటీ సభ్యులు రాంబాబు, ఎమ్.అప్పలరాజు, కె.చంద్రశేఖర్ రెడ్డి, జై చంద్రారెడ్డి, మల్లేష్, రాఘవేంద్ర, రాజగోపాల్ నాయుడు, రామారావు, పెద్దులు, రాజేంద్ర లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *