విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసుకున్న వారికి మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి) ముఖ్యమంత్రి సహాయనిది చెక్కులు పంపిణీ చేశారు. పశ్చిమ నియోజకవర్గానికి చెందిన బాధితులకు వైద్య సహాయం కోసం దరఖాస్తు చేసిన లబ్ధిదారులకు మొత్తం 59 చెక్కులను రూ 25 లక్షల 45 వేల విలువైన చెక్కులను బాధితులకు ఎన్డీఏ కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయనిది అండగా నిలుస్తోందన్నారు. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ప్రజా ఆరోగ్యానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ విద్యా ,వైద్య రంగాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ఇప్పటివరకు 347 మంది లబ్ధిదారులకు రూ 2 కోట్ల 80 లక్షల,70 వేల విలువైన ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను, మరియు 79 మంది బాధితులకు రూ 3 కోట్ల 80 లక్షల 52 వేల విలువైన ఎ ల్ ఓసీ (లెటర్ ఆఫ్ క్రెడిట్) పత్రాలను అందజేశామన్నారు. ప్రజారోగ్య భద్రతే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు, కార్పొరేటర్ మైలవరపు మాధురి లావణ్య,మాజీ కార్పొరేటర్లు యేదుపాటి రామయ్య, అబ్దుల్ ఖాదర్, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొడ్డు నాగలక్ష్మి, కూటమి నేతలు బొల్లేపల్లి కోటేశ్వరరావు, ఏలూరు సాయి శరత్, పితాని పద్మ, పగడాల కృష్ణ, నున్నకృష్ణ, భూదాల నందకుమారి, డాక్టర్ సిహెచ్ హనుమంతరావు , రుద్రపాటి వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News