Breaking News

మెగా ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పలు ఆసుపత్రుల వైద్యుల సహకారంతో 34 వ డివిజన్, కేదారేశ్వరపేట , విఎంసి కళ్యాణమండపంలో ఆర్థోపెడిక్, డెంటల్, , స్త్రీల అనారోగ్య సమస్యలు, ఆయుర్వేద వైద్యశాలల ఉచిత ఆరోగ్య వైద్య శిబిరాన్ని శనివారం మాజీ కేంద్ర మంత్రి వర్యులు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజనా చౌదరి ) ప్రారంభించారు. జనరల్ మెడిసిన్, గైనకాలజీ, పల్మనాలజీ, దంత సమస్యలు, కంటి వైద్యం, ఆయుర్వేద వైద్య విభాగాలలో పరీక్షలు నిర్వహించారు, ఈ వైద్య శిబిరంలో సుమారు 325 మంది పాల్గొని చికిత్సలు పొందారు.. అవసరమైన వారికి డాక్టర్లు ఉచితంగా మందులు అందజేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ పేద, మధ్యతరగతి వర్గాల ప్రజలు అధికంగా నివసించే పశ్చిమ నియోజకవర్గం లో వారి ఆరోగ్య సంరక్షణ కోసం మెగా ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సమాజ సేవలో భాగస్వాములై సేవలందిస్తున్న వైద్యులను ఎమ్మెల్యే సుజనా అభినందించారు.

ఈ శిబిరంలో ఒమేగా అను మై బేబీ హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ మౌనిక, బెస్ట్ సూపర్ స్పెషాలిటీ డాక్టర్లు డాక్టర్ పూజిత, డాక్టర్ శ్రీ తేజ, డాక్టర్ భవాని, దూహిత డెంటల్ వైద్యశాల డాక్టర్ పల్లవి, పిళ్ళైయార్ ఆయుర్వేద వైద్యశాల డాక్టర్లు డాక్టర్ సత్య ప్రసాద్, డాక్టర్ గాయత్రి మ్యాక్సీవిజన్ ఐ హాస్పిటల్ మేనేజర్ డాక్టర్ రామ్మోహన్రావు తమ సేవలు అందించారు.

ఈ కార్యక్రమంలో దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ నాగుల్ మీరా , టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు,
కూటమి నేతలు అడ్డూరి కొండలరావు, రుద్రపాటి వెంకటేష్, ఆకుల రవిశంకర్,బొడ్డు నాగలక్ష్మి, ఆకుల తన్వి నాయుడు,
ఎమ్మెల్యే కార్యాలయ సిబ్బంది రియాజ్ సుల్తానా, చింతా సృజన్ ( బాబీ) మోహన లక్ష్మీ, సుజనా మిత్ర కోఆర్డినేటర్లు పర్యవేక్షించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *