Breaking News

దోమల వల్ల కలిగే వ్యాధుల నివారణ కొరకు ఫ్రైడే డ్రై డే

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
దోమల వల్ల కలిగే వ్యాధుల నుండి నివారణ కొరకు ఫ్రైడే ఫ్రైడే నిర్వాహనతో ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యాన చంద్ర ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం దేవినేని గాంధీ పురం, శాంతి నగర్ ప్రాంతాలలో ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలు దోమల బారిన పడకుండా ఉండేందుకు విఎంసి సిబ్బంది అవగాహన కల్పించారు. అందులో భాగంగా అక్కడ నివసిస్తున్న ప్రజల వారి ఇళ్లలో ఉన్న నీటి నిల్వలను శుభ్రం చేస్తూ ప్రతి ఫ్రైడే డ్రై డే నిర్వహించాలని, వారికి అవగాహన కల్పిస్తూ దోమలు పెరగకుండా ఆంటీ లార్వా ఆపరేషన్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బయోలజీస్ట్ కామేశ్వరరావు, మలేరియా సిబ్బంది, ఏ ఎన్ యం లు, ఆశ వర్కర్లు, పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *