Breaking News

NDB ఆధ్వర్యంలో రహదారుల పనులపై ఆర్ & బీ శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సమీక్షా సమావేశం

-NDB రహదారులను త్వరితగతిన పూర్తి చేయడంపై దృష్టిసారించాలి
-కాంట్రాక్టర్లకు త్వరితగతిన బిల్లులు చెల్లించే ప్రయత్నం చేస్తాం
-మార్చి 2026 నాటికి పనులు పూర్తి చేస్తామని తెలిపిన NDB కాంట్రాక్టర్లు
-రాష్ట్రంలో తీవ్రంగా దెబ్బతిన్న రహదారులను తొలి ప్రాధాన్యతగా అభివృద్ధి చేయాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో ధీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు తొలి ప్రాధాన్యత కల్పించడం ద్వారా ప్రజలకు మెరుగైన సమర్థవంతమైన రహదారులను కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్ రెడ్డి తెలిపారు. ప్రజలకు గుంతల – గోతుల రహిత రహదారుల కల్పనకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి స్పష్టం చేశారు.. నేడు విజయవాడలోని ఈఎన్సీ కార్యాలయంలో NDB పనులపై ఆర్ & బీ శాఖ స్పెషల్ ఛీప్ సెక్రటరీ ఎం. టీ కృష్ణబాబుతో కలిసి మంత్రి సమీక్షించారు.. ఈ సందర్భంగా NDB పనుల స్థితి గతులపై ఆర్ & బీ శాఖ అధికారులు, NDB కాంట్రాక్టర్ లతో స్వయంగా మంత్రి మాట్లాడారు..

NDB పనుల జాప్యం కావడంతో క్షేత్రస్థాయిలో ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న క్రమంలో వాటిని త్వరితగతిన పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు మంత్రి సూచించారు.. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లింపులు త్వరతగతిన పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తామని, కాబట్టి మిగిలిన పనులను కూడా వేగంగా పూర్తి చేయాలని వారిని కోరారు. అదే సమయంలో నాణ్యతా ప్రమాణాల విషయంలో రాజీపడవద్దన్నారు. NDB ప్రాజెక్టు కింద తగ్గించిన పనులకు సంబంధించి కొత్త అంచనా వ్యయంతో కూడిన నివేదికను 15 రోజుల్లో సమర్పించాలని అధికారులను ఆదేశించారు.. అదే క్రమంలో కాంట్రాక్టర్లకు సంబంధించి బ్యాంకు గ్యారెంటీ విషయంలో వెసులుబాటు కల్పించే అంశాన్ని పరిశీలిస్తామన్నారు.. NDB రహదారులను కుదించే క్రమంలో వంతెనలు, కల్వర్టులు మినహాయించి, కేవలం రహదారుల నిర్మాణం చేపట్టి, యాక్సిడెంట్ లకు ఆస్కారం కల్పించే పొరపాట్లకు తావులేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో నిలిచిన NDB రోడ్ల పనులను మా కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక పట్టాలెక్కించి, కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు దాదాపు రూ. 239 కోట్ల మేర బిల్లులు చెల్లించామన్నారు.. అయితే అనంతరం అనివార్య కారణాలతో పనుల్లో వేగం పుంజుకోలేదని తెలిపారు.
NDB రహదారుల పనులకు సంబంధించి రూ. 1680.97 కోట్లతో 85 NDB రోడ్ల పనులను 682 కి.మీ కు కుదించడం జరిగింది.. అనంతరం కాంట్రాక్టర్ లతో మాట్లాడి నిలిచిన పనులను తిరిగి పట్టాలెక్కించడం జరిగింది.. ఇందులో ఇప్పటికే 546 కి.మీ మేర పనులు ప్రారంభించగా, 236 కి.మీ మేర పనులు పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే రూ. 932.99 కోట్ల మేర పనులు పూర్తి చేయడం జరిగింది.

ఫేజ్ 1 కింద ఇప్పటి వరకు ఇప్పటి వరకు దాదాపు 747.98 కోట్ల పనులు పూర్తి చేసి, రూ. 434 కోట్ల మేర నిధులు కాంట్రాక్టర్లకు చెల్లించడం జరిగింది. రూ. 161 కోట్ల బిల్లులు CFMS కింద ఇప్పటికే అప్ లోడ్ చేయడం జరిగింది.. మరో దాదాపు 151 కోట్ల మేర బిల్లులు ఇంకా అప్ లోడ్ చేయాల్సి ఉంది. మొత్తంగా ఇప్పటి వరకు 44.49 % మేర పనులు పూర్తి చేశామన్నారు. అయితే దాదాపు 6 జిల్లాల్లో 50 శాతం కంటే తక్కువ పనులు మాత్రమే జరిగిన క్రమంలో ఆయా జిల్లాల్లో అధికారులు పనులు వేగం పెంచేందుకు మరింత దృష్టిసారించాలి.

ఈ సందర్భంగా కాంట్రాక్టర్లు మాట్లాడుతూ.. మార్చి 2026 లోపు NDB పెండింగ్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.. అదే సమయంలో తమ పెండింగ్ బిల్లులు త్వరితగతిన అందజేయాలని మంత్రికి విన్నవించారు. త్వరలో NDB కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు చెల్లించి, ఆయా పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు సహాకరిస్తామని మంత్రి తెలిపారు..

రాష్ట్రంలో రహదారుల అభివృద్ధిలో ధీర్ఘకాలంగా అభివృద్ధికి నోచుకోని రహదారులకు ప్రాధాన్యత కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్న రహదారుల అభివృద్ధి పనుల్లో… గతంలో NDB & CRIF కింద రద్దయిన 650 కి.మీ పనులకు అత్యంత ప్రాధాన్యత కల్పించి అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను మంత్రి నొక్కిచెప్పారు.. ప్రస్తుతం వర్షాకాలం సీజన్ ముగిసిన క్రమంలో రహదారులు మరమ్మతులు & అభివృద్ధి పనులు వేగవంతం చేయాల్సిన అవసరాన్ని మంత్రి అధికారులు తెలియజేశారు..

మంత్రి అధ్యక్షతన జరిగిన ఈ సమీక్షా సమావేశంలో ఆర్ & బి శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ, ఎం.టి కృష్ణబాబు, చీఫ్ ఇంజనీర్లు శేషు కుమార్, విజయశ్రీ, తదితర ఉన్నతాధికారులు, NDB కాంట్రాక్టర్లు పాల్గొన్నారు..

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *