Breaking News

286 సచివాలయంల్లో వ్యాక్సిన్ స్పెష‌ల్‌ డ్రైవ్‌…

-వ్యాక్సినేషన్ తో కరోనా నియంత్రణ
-న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్‌

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ్యాక్సిన్ తోనే కరోనా నియంత్రణ సాధ్యమని, న‌గ‌రంలో స్పెష‌ల్‌ డ్రైవ్ ద్వారా వ్యాక్సినేషన్ కార్యక్రమము ప్రారంభించ‌డం జ‌రిగింద‌ని, ప్రతి ఒక్కరు వ్యాక్సినేష‌న్ వేయించుకొవాలని న‌గ‌ర పాల‌క సంస్థ క‌మిష‌న‌ర్ ప్ర‌స‌న్న వెంక‌టేష్ ఐ.ఏ.ఎస్ పేర్కొన్నారు.. 18 సంవ‌త్స‌రాలు పైబ‌డి 45 సంవత్సరాల లోపు వారికి కూడా వ్యాక్సిన్ వేయ‌డం జ‌రుగుతుంద‌న్నారు. న‌గ‌రంలోని మూడు నియోజ‌క‌వ‌ర్గాలలో ప‌రిధిలోని 286 స‌చివాల‌యంల్లో వ్యాక్సిన్ స్పెషల్ డ్రైవ్ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. 42900 కోవిషీల్డ్ / కొవ్యాక్షిన్ మొదటి మరియు రెండోవ డోసులు అందుబాటులో ఉన్నాయ‌న్నారు., క‌రోనా క‌ట్ట‌డికి వ్యాక్సినేష‌న్ ఒక్క‌టే శాశ్వ‌త మార్గమని, యువ‌త స‌హ‌క‌రించాల‌ని పిలుపునిచ్చారు. వ్యాక్సినేషన్‌ ప్రక్రియ నిరంతరంగా కొనసాగుతోందన్నారు. నగర పరిధిలో 18 సంవత్సరాల పైబడిన వారందరికీ వ్యాక్సినేషన్ అందించాల‌నే ల‌క్ష్యంతో వార్డ్ సచివాలయాలు మొదటి / రెండోవ డోస్ గా కోవిషిల్డ్ / కొవాక్షిన్ అందిస్తున్న‌ట్లు ఆందరూ సద్వినియోగ పరచుకోవాలన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *