Breaking News

ప్రజల ఆరోగ్యానికి ప్రాధాన్యతనిస్తూ, ఇటువంటి సేవా కార్యక్రమాలను స్వచ్ఛంద సంస్థలు చేపట్టాలి -MLA బొండా ఉమ

-ఈ మెడికల్ క్యాంపు ద్వారా స్థానిక ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలను, మందులను ఉచితంగా అందిస్తున్నారు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ నియోజకవర్గంలోని 62వ డివిజన్, పాయకాపురం JNC చర్చి ప్రాంగణంలో మంగళవారం JNC మినిస్ట్రీస్ సంస్థ ఆధ్వర్యంలో  ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వర రావు లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్బంగా బొండా ఉమ మాట్లాడుతూ:- JNC మినిస్ట్రీస్ వారు చేపట్టిన ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని, ఈ క్యాంపులో అత్యంత అనుభవం కలిగిన వైద్య నిపుణులు వివిధ హాస్పెటల్స్ వారు పాల్గొని, వివిధ విభాగాలలో రోగులకు సమగ్ర వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారని…ఈ క్యాంపులో కార్డియాలజీ (గుండె సంబంధిత), ఆర్థోపెడిక్స్ (ఎముకలు మరియు కీళ్ల సంబంధిత), డెంటల్ (దంత సంబంధిత), ఆప్తమాలజీ (కంటి సంబంధిత), గైనకాలజీ (స్త్రీల ఆరోగ్య సంబంధిత), పీడియాట్రిక్స్ (పిల్లల ఆరోగ్య సంబంధిత), మరియు జనరల్ మెడిసిన్ విభాగాలకు చెందిన నిపుణులైన వైద్యులు తమ సేవలను అందిస్తున్నారు అని…ఈ వైద్య నిపుణులు రోగుల ఆరోగ్య సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వారికి సరైన చికిత్స మరియు సలహాలను అందిస్తున్నారు అని, ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదపడతాయని..ఈ ఉచిత మెగా మెడికల్ క్యాంపులో అను ఒమేగా హాస్పిటల్, ఎనికేపాడు; అమరావతి ఐ హాస్పిటల్; దూహిత డెంటల్ హాస్పిటల్; మరియు హియర్ జాప్ హాస్పిటల్ వంటి ప్రముఖ వైద్య సంస్థలు భాగస్వామ్యం వహించి, తమ నిపుణులైన వైద్య బృందాలను పంపించి, ప్రజలకు విలువైన వైద్య సేవలను అందిస్తున్నారు అని తెలియజేసారు.

ఈ కార్యక్రమం లో నిర్వాహకులు, బిషప్ రబ్బునీ, డివిజన్ అధ్యక్షులు జలకం రాజా, ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ఘంటా కృష్ణమోహన్ తోపాటు ప్రజలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *