Breaking News

కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలి…

-ఎన్టీఆర్ జిల్లా టిడిపి ఎస్సీ సెల్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తిరువూరు ఎమ్మెల్యే కొరికిపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేశినేని చిన్నిపై ఎంపీ కార్యాలయం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగ సంజయ్ వర్మ విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గం కార్యదర్శి కొట్టేటి హనుమంతరావు,లు ఖండించారు. ఎమ్మెల్యే కొలికపూడి చేసిన అనుచిత వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎంతో నిబద్ధత కలిగిన తెలుగుదేశం పార్టీపై ఆరోపణలు చేయడం సబబు కాదని హితవు పలికారు. మంగళవారం గాంధీనగర్ స్థానిక ప్రెస్ క్లబ్‌లో టిడిపి జిల్లా పార్టీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఎన్టీఆర్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సొంగా సంజయ్ వర్మ, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ కార్యదర్శి కొట్టేటి హనుమంతురావు, విజయవాడ అర్బన్ ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు జివి. నరసింహారావు, రాష్ట్ర అధికార ప్రతినిధి పరిశపోగు రాజేష్, పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తిరువూరు ఎమ్మెల్యే కొడుకుపూడి శ్రీనివాసరావు, ఎంపీ కేసినేని చిన్ని, ఎంపీ కార్యాలయం పై చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఎంతో నియమ నిబంధనలు కలిగిన టిడిపి పై ఆరోపణలు చేయడం సబబు కాదన్నారు. కొలికిపూడి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. టిడిపిలో పదవి కోసం డబ్బులు ఖర్చు పెట్టాలి. అని చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాన్నారు. తిరువూరు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని ఎంపీ కేశినేని చిన్ని, ఎంతో తపించారన్నారు. ఆయనపై ఇటువంటి అసందర్భ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *