Breaking News

అంతరాయం లేని సాగు నీటి సరఫరా జరగాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో సాగునీటి కాలువలు పరిధిలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జలవనరుల శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. సాగు నీటి కాలువలు క్రింద ఉన్న తాగునీటి చెరువులను నింపుటకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పారు. జిల్లాలోని భారీ సాగు నీటి కాలువలు కే డబ్ల్యు డెల్టా, గుంటూరు కెనాల్స్, నాగార్జున సాగర్ ప్రాజెక్టు సత్తెనపల్లి, లింగాయపాలెం బ్రాంచ్ కాలువల పరిధిలోని సాగు భూముల విస్తీర్ణం, వరదనీటి డ్రైయిన్లు వివరాలను మ్యాప్ లు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులు జిల్లా కలెక్టర్ కు తెలిపారు . ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కాలువల నిర్వహణ, మరమ్మత్తులు, అభివృద్ధికి మంజూరు చేసిన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షించి వేగవంతంగా పనులు పూర్తి చేయుటకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గుంటూరు ఛానల్ అభివృద్ధి, విస్తరణ పనులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియ ను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించాలన్నారు. కెనాల్స్ లో పూడికతీత, నిర్వహణ పనులు సక్రమంగా జరిగేలా నిరంతరం అధికారులు పర్యవేక్షించాలన్నారు.

ఈ సమావేశంలో ఇరిగేషన్ ఎస్ ఈ వెంకటరత్నం, ఈఈ రమేష్, డ్రైయినేజ్ విభాగం డీఈ ధనలక్ష్మి, ఏఈలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *