అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆర్టీసి ఉద్యోగులకు విలీనంకు ముందున్న పద్దతుల్లో పదోన్నతలకు సంబందించి పనిష్ మెంట్లు, క్రమశిక్షణాచర్యలు, పెనాల్టీల పై విలీనంకు ముందున్న పద్దతుల్లోనే అనుమతులు ఇప్ఫించాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ చేసిన విజ్ఞప్తి మేరకు ఆర్టీసీ విసి & యం.డి ద్వారకాతిరుమలరావు టిఆర్ & బీ అధికారులను,రవాణా మంత్రీని, ముఖ్యమంత్రి ని ఒప్పించి పదోన్నతలకు ఆగస్టు 28 న గ్రీన్ సిగ్నల్ ఇప్పించినప్పటికీ ఇంతవరకు జీఏడి అధికారులవద్ద నిలిచిపోయిన పదోన్నతలకు సంబందించి ఈనెల 18 న మంత్రివర్గ ఉపసంఘం వద్ద జరిగిన చర్చలలో ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ & ఏపిజేఏసి అమరావతి చేసిన కృషిమేరకు దీపావళి సందర్బంగా జి.ఓ విడుదలతో 129 డిపోలు, నాలుగు వర్కుషాపులలో ఉద్యోగులకు సూమారు ఆరువేల మందికి పదోన్నతలుకు అవకాశం ఇప్పించీనందుకు గౌః ముఖ్యమంత్రి గారికి, టిఆర్& బి స్పెషల్ సెక్రటరీ కృష్టబాబుకి, రవాణామంత్రి కి, ఆర్టీసి యం.డి ద్వారకాతిరుమలరావు కి కృతగ్ఞతలు తెలియజేస్తున్నామని ఏపిపిటిడి ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రదాన కార్యదర్శి జి.వి.నరసయ్య మంగళవారం ఒక ప్రకటనద్వారా తెలిపారు.
పదోన్నతల జి.ఓ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన వెంటనే పదోన్నతలు పక్రియ ప్రారంబించేలా చర్యలు తీసుకున్న ఆర్టీసి విసి & యం.డి కి మంగళవారం ఆర్టీసిహౌస్ లో కలసి సత్కరించారు. ఈసందర్బంగా ఇంకా మిగిలి ఉన్న కేటగిరులకు కూడా విలీనంకు ముందున్న పాతపద్దతుల్లో పదోన్నతలకు అనుమతులు వచ్ఛేలా చూడాలని విజ్ఞప్తి చేయగా ఈవిషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్తానని యం.డి హామి ఇచ్చారని తెలిపారు. మంగళవారం యం.డి ని కలిసినవారిలో ఇ.యు రాష్ట్రనాయకులు యం.డిఏ.సిద్దిక్, యం.శంకరరావు, యస్.కె.మోహిద్దిన్, ఎన్.హెచ్.ఎన్. చక్రవర్తి, జి.యస్.నారాయణ, వై.యస్.రావు, రెడ్డి తధితరులు కలిసి సత్కరించారు.
పదోన్నతలుపై సి.యం కు ధన్యవాదాలు తెలియజేస్తు రాష్ట్రవ్యాప్తంగా ఇ.యు సంబరాలు
మంగళళవారం విజయవాడ డిపోలో జోనల్ కార్యదర్శి వై.శ్రీనివాసరావు ఆద్వర్యంలో జరపగా రాష్ట్రంలో చాలా డిపోలలోను సంబరాలు జరిపారు.,బుదవారం మిగిలి ఉన్న కొన్ని డిపోలలో స్వీట్లు పంచుకుంటూ బాణాసంచాలు కాలుస్తూ కూటమి ప్రభుత్వానికి,సి.యం.కు యం.డి కృతగ్జతలు తెలియజేస్తూ ఆర్టీసి ఎంప్లాయీస్ యూనియన్ ఆద్వర్యంలో సంబరాలు చేస్తున్నామని ఇ.యు రాష్ట్రఅధ్యక్షులు పలిశెట్టి దామోదరరావు తెలిపారు.
Prajavartha Online Telugu News