Breaking News

వైస్సార్సీపీ కోటి సంతకాల సేకరన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వైస్సార్సీపీ కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా ఈ రోజు తూర్పు నియోజకవర్గ పరిధిలోని 3వ డివిజన్ విజయనగర కాలనీ మెయిన్ రోడ్,17వ డివిజన్ రాణిగారితోట మెయిన్ రోడ్18వ డివిజన్,సిమెంట్ గౌడాన్,9వ డివిజన్ పటమటలంక చేపల మార్కెట్ సెంటర్ 7వ డివిజన్ శిఖామణి సెంటర్ నందు స్థానిక డివిజన్ కార్పొరేటర్లు,ప్రెసిడెంట్లు, వైసీపీ శ్రేణులతో కలిసి ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు దేవినేని అవినాష్ గారు ముఖ్య అతిధిగా పాల్గొని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటికరణ వ్యతిరేకంగా ప్రజల నుండి సంతకాలు సేకరించారు.

రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్‌ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలని ఎన్టీఆర్ జిల్లా వై.యస్,ఆర్.కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పిలుపునిచ్చారు.బలహీనవర్గాల ప్రజల ఉన్నతి కోసం గత వైసీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలొ కొత్తగా 17 మెడికల్‌ కాలేజీలను నిర్మాణానికి నంది పలికారు. వీటిలో 7 పూర్తి అయ్యాయని, రాష్ట్రంలో అభివృద్ధే జరగలేదంటూ కూటమి నాయకులు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యశ్రీ కింద అందించే సేవలు బంద్‌ అయ్యాయని అన్నారు. ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలను ప్రైవేటీకరణ జరగకుండా ఆపేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని అధినేత వైఎస్‌ జగన్మోహన రెడ్డి చేపట్టారన్నారు.ప్రభుత్వ మెడికల్ కాలేజ్ లు కూడా ఫీజులు దోపిడీకి రెడ్ కార్పోట్ వేస్తున్నారు.రాష్టంలో కూటమి ప్రభుత్వ రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడం తప్ప ప్రజలకు సంక్షేమం,అభివృద్ధి చేయడం లేదు అన్నారు.ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,కార్పరేటర్లు అంబెడ్కర్,మాధురి,సీనియర్ నాయకులూ వల్లూరు ఈశ్వర ప్రసాద్,డివిజన్ అధ్యక్షులు కిస్సి,బిక్షాలు రెడ్డి,కాశీ,మండల అధ్యక్షలు సాయి కృష్ణ,ఉదయ్,కళ్యాణ్ ఆయా డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

 

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *