Breaking News

ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలి… : వైఎస్ షర్మిల

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వం ఆరోగ్యశ్రీ (ఎన్టీఆర్ వైద్యసేవ) బిల్లుల్ని చెల్లించడంలో విఫలం కావడంతో ప్రైవేటు ఆస్పత్రులు సేవల్ని నిలిపేశాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యశ్రీ నిధులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం విజయవాడ ఆంధ్రరత్న భవన్ వద్ద ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల నిరసన తెలిపారు. వర్షంలో తడుస్తూ స్టేచర్ పట్టుకొని నిరసన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీ గా మార్చారని షర్మిల ఆందోళన వ్యక్తం చేసారు. ఆరోగ్యశ్రీ పథకం పెట్టి వైఎస్సార్ దేవుడైతే… పథకాన్ని ఆపి చంద్రబాబు రాక్షసుడు అయ్యాడంటూ షర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆరోగ్యశ్రీ పేరు ఏదైనా సరే పథకాన్ని కొనసాగించాలని కోరారు. నారావారి ఆరోగ్య సేవా అని పెట్టుకున్నా తమకు అభ్యంతరం లేదన్నారు. వెంటనే 2700 కోట్లు ఆస్పత్రులకు విడుదల చేయాలన్నారు. గతంలో వైసీపీ 2 వేల కోట్లు బకాయిలు పెట్టింది సరే మీ బుద్ధి ఎటుపోయిందని కూటమి సర్కార్ ను ప్రశ్నించారు.

ఆరోగ్యశ్రీ పథకాన్ని బంద్ పెట్టే కుట్ర జరుగుతుందని షర్మిల ఆరోపించారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని కోమాలో నెట్టే ప్రయత్నం జరుగుతుందన్నారు. ఇదెక్కడి అన్యాయం అని ప్రశ్నించారు. వైఎస్ కి గొప్ప పేరు తెచ్చి పెట్టిన పథకం ఆరోగ్యశ్రీ అని, పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకొని పథకాన్ని రూపకల్పన చేశారన్నారు. కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీ కొనసాగించే పరిస్థితి లేదని, బిల్లులు చెల్లించలేదు అని గత 14 రోజులుగా ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలను నిలిపి వేశారని షర్మిల తెలిపారు. ప్రైవేట్ ఆసుపత్రులు వైద్య సేవలు నిలిపి వేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమాధానం చెప్పాలని షర్మిల కోరారు. ఆరోగ్యశ్రీ అందకుండా పడుతున్న బాధలకు సమాధానం ఎవరు చెప్తారని ప్రశ్నించారు. ఆరోగ్యశ్రీ తీసివేస్తే మళ్ళీ ఆస్తులు అమ్ముకొని ట్రీట్మెంట్ చేయించుకోవాలా అని ప్రశ్నించారు. లేకుంటే వైద్యం అందలేదు అని చనిపోవాలా అని అడిగారు. ఆరోగ్య భద్రత ఇవ్వని మీరు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. కూటమి పాలన 16 నెలల్లో 5900 కోట్ల మేర బిల్లులు పెట్టారని, ఇందులో 5200 కోట్లు మాత్రమే చెల్లించారన్నారు. ఇంకా 700 కోట్లు చెల్లించాల్సి ఉందన్నారు ఆరోగ్య శ్రీ సేవలను వెంటనే పునరుద్దరించక పోతే తాను ఆమరణ దీక్షకు దిగుతానని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *