Breaking News

వికాస ఆధ్వర్యంలో అక్టోబర్ 25న జాబ్ మేళా కలెక్టర్ కీర్తి చేకూరి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
“వికాస” ఆధ్వర్యంలో ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 9.30 గంటలకు రాజమహేంద్రవరం కలెక్టరేట్ పరిసరాల్లోని వికాస కార్యాలయం (బొమ్మూరు హార్లిక్స్ ఫ్యాక్టరీ ఎదురుగా)లో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని ఆమె సూచించారు. ఈ జాబ్ మేళాలో ఎస్‌ఎస్‌సి, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణులైన 35 ఏళ్ల లోపు అభ్యర్థులకు వివిధ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు వివరించారు. ఎంపికైన వారికి నెలకు రూ.10,000/- నుండి రూ.30,000/- వరకు వేతనం, అదనంగా ఇన్సెంటివ్స్, భోజనం, వసతి, రవాణా సదుపాయాలు ఆయా సంస్థల నియమావళి ప్రకారం అందజేయబడతాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు తమ అసలు సర్టిఫికెట్లతో పాటు జెరాక్స్ కాపీలు తీసుకొని తప్పనిసరిగా హాజరుకావాలని వికాస ప్రాజెక్ట్ డైరెక్టర్ కె. లచ్చారావు సూచించారు. మరిన్ని వివరాల కోసం 7660823903 లేదా www.vikasajobs.com వెబ్‌సైట్‌లో సంప్రదించ వచ్చని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *