Breaking News

కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఎంతో కీలక పాత్ర…

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తుఫాన్ వంటి విపత్కర పరిస్తితుల్లో ప్రజలకు అధికారులకు సమన్వయం చేయడంలో కమాండ్ కంట్రోల్ రూమ్ లు ఎంతో కీలక పాత్ర పోషిస్తాయని, కమాండ్ కంట్రోల్ రూమ్ సిబ్బంది షిఫ్ట్ల వారీగా ఓర్పుతో ప్రజల నుండి అందే పిర్యాదులను స్వీకరించాలని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మరియు నగర కమిషనర్ పులి శ్రీనివాసులు తెలిపారు. మంగళవారం మొంథా తుఫాన్ సన్నద్దతకు నగర పాలక సంస్థ కార్యాలయంలోని కాన్ఫరెన్సు హాల్ లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ను తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, కమాండ్ కంట్రోల్ రూమ్ కి అందే పిర్యాదులను క్షేత్ర స్తాయి సిబ్బందితో సమన్వయం చేసుకుంటూ పరిష్కారం అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి పిర్యాదు తప్పనిసరిగా రిజిస్టర్ లో నమోదు చేయాలన్నారు. నియోజకవర్గాల వారీగా పునరావాస కేంద్రాలకు వస్తున్న ప్రజల వివరాలు, జిల్లా కలెక్టర్ మరియు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు నివేదికలను అదనపు కమిషనర్ సమీక్షించి చర్యలు తీసుకోవాలన్నారు. తుఫాన్ కారణంగా అధికవర్షాలు కురిసే అవకాశం ఉన్నదని, వర్షాల వలన ప్రజలకు ఏమైనా ఇబ్బందులు ఏర్పడితే నగర పాలక సంస్థ కమాండ్ కంట్రోల్ రూమ్ నెంబర్లకు 0863-2345103 మరియు 9849908391 ఫోన్ చేయాలన్నారు. ఈ కమాండ్ కంట్రోల్ రూమ్ 3 షిఫ్టులలో 24 గంటలు పనిచేస్తాయన్నారు. గుంటూరు నగరంలో 12 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించుట జరిగిందని, సదరు ప్రాంతాలలో ముందస్తు జాగ్రత్త చర్యలు కూడా తీసుకున్నామన్నారు. ముఖ్యంగా ప్రజలు పురాతన భవనాలలో ఉండవద్దని, పురాతన భవనాలలో ఉంటున్న ప్రజలు నగర పాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలలోకి రావాలని, ఆయా కేంద్రాలలో అన్ని వసతులు ఏర్పాటు చేశామని తెలియచేశారు. సదరు కార్యక్రమంలో అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు, ఇంచార్జ్ యస్.ఈ సుందరరామిరెడ్డి, మేనేజర్ బాలాజీ బాషా, వివిధ డివిజన్ల కర్పోరేటర్లు, వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *