Breaking News

నగర ప్రజలు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథా తుఫాన్ ప్రభావం వలన నగర ప్రజలు ఇబ్బంది పడకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని, ఎక్కడైనా సమస్య ఉంటే తమ దృష్టికి తెస్తే యుద్దప్రాతిపదికన చర్యలు తీసుకుంటామని నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర అన్నారు. మంగళవారం నగర కమిషనర్ పులి శ్రీనివాసులుతో కలిసి బొంగరాలబీడులోని వెంగమాంబ సత్రం, మిర్చియార్డ్ రైతు విశ్రాంతి భవనంలో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించి, వసతులు, ఏర్పాట్లపై అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ తుఫాన్ ని ఎదుర్కోవడానికి జిఎంసి ఆధ్వర్యంలో విస్తృత చర్యలు తీసుకుంటున్నామని, ముఖ్యమంత్రి పిలుపు మేరకు ప్రస్తుత విపత్కర పరిస్తితుల్లో కూటమి నాయకులు కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. పునరావాస కేంద్రాల్లో సమగ్ర మౌలిక వసతులు కల్పించి, ఆహారం, త్రాగునీరు అందించడం జరుగుతుందని, ఎక్కడా లోపాలు తలెత్తకుండా నోడల్ అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, తుఫాన్ నేపధ్యంలో గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో 74 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశామని, వాటిలో ప్రస్తుతం 17 వందల మంది ఉన్నారని మంగళవారం రాత్రికి వారి సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు. పునరావాస కేంద్రాల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పించామని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ సమీప కేంద్రాలకు వెళ్లాలని కోరారు. చిన్న పిల్లలకు బిస్కెట్స్, పాలు కూడా అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించామన్నారు. నగరంలో ఎక్కడా ఆస్తి, ప్రాణ నష్టం కల్గకూడదని తమ లక్ష్యమన్నారు. ఇప్పటికే వార్డ్ ల వారీగా నోడల్ అధికారులను అప్రమత్తం చేశామని, అధికారులు, సచివాలయ కార్యదర్శులకు సెలవులు రద్దు చేశామని తెలిపారు. జిఎంసి పరిధిలోని 3 నియోజకవర్గాలకు ప్రత్యేక అధికారులను నియమించామని, మేజర్ డ్రైన్లలో పూడికతీత పనులు చేపట్టామన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా తక్షణం జిఎంసి కమాండ్ కంట్రోల్ రూమ్ కి సమాచారం అందించాలని సూచించారు.
జనసేన జిల్లా అధ్యక్షులు గాదె వెంకటేశ్వరరావు మాట్లాడుతూ తుఫాన్ రక్షణ చర్యల్లో ప్రభుత్వం ఎంతో ముందు చూపుతో కృషి చేస్తుందన్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులను జిల్లాలకు ఇంచార్జిలుగా నియమించడం, పునరావాస కేంద్రాలతో పాటు ఆరోగ్య రక్షణ చర్యలు కూడా చేపట్టడం జరుగుతుందన్నారు. జిఎంసి సిబ్బంది ప్రధానంగా మేజర్ డ్రైన్లలో వ్యర్దాలు నిల్వ కుండా చర్యలు తీసుకోవాలని కోరారు. పర్యటనలో డిప్యూటీ కమిషనర్లు బి.శ్రీనివాసరావు, సిహెచ్.శ్రీనివాస్, నోడల్ అధికారులు, వివిధ డివిజన్ల కార్పోరేటర్లు, అధికాలరు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *