Breaking News

ప్రజల క్షేమమే ప్రథమ ధేయం

-తుఫాను భద్రత చర్యలుగా 41 పునరావాస కేంద్రాలు
-వర్షాలు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుంది

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారి కోసం విజయవాడ నగర వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో మొత్తం 41 పునరావాస కేంద్రాలన ఏర్పాటు చేశామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి తెలిపారు. బుధవారం లెక్కల ప్రకారం, మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 349 మంది ప్రజలు పునరావాస కేంద్రాలలో బస చేస్తున్నారని, బుధవారం ఉదయం  మేయర్ మీడియా తో అన్నారు . వర్షాలు కారణంగా ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు. మొంథ తుఫాన్ కారణంగా విజయవాడ నగరంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కొండ ప్రాంతాల్లో నివసించే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో, వారి కోసం నగరపాలక సంస్థ తరఫున విస్తృత స్థాయిలో పునరావాస చర్యలు చేపట్టామని మేయర్ రాయన భాగ్యలక్ష్మి వెల్లడించారు. కొండ ప్రాంతాలలో నివాసం ఉంటున్న వారి కోసం విజయవాడ నగర వ్యాప్తంగా మూడు నియోజకవర్గాల్లో మొత్తం 41 పునరావాస కేంద్రాలన ఏర్పాటు చేశామని మేయర్ తెలిపారు. సర్కిల్-1 పరిధిలో 15, సర్కిల్-2 పరిధిలో 16, సర్కిల్-3 పరిధిలో 10 కేంద్రాలను సిద్ధం చేశామన్నారు.

ఈ కేంద్రాలలో ప్రజలకు పూర్తిస్థాయిలో మరుగుదొడ్లు తో పాటు, వైద్య సేవలు కూడా అందుబాటులో ఉంచామని, డీఎంహెచ్‌వో  ద్వారా వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా వైద్య సహాయం అందిస్తున్నామని వివరించారు. ప్రతిరోజు ఎంతో మంది నిరాశ్రయులైన ప్రజలు ఈ కేంద్రాలకు వచ్చి, కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఆహారాన్ని తీసుకుంటున్నారని, కొంతమంది భోజనం చేసి వారి బంధువుల ఇళ్లకు వెళ్తుంటే, మరికొంతమంది ఆ సెంటర్లలోనే ఉంటున్నారని మేయర్ తెలిపారు. బుధవారం బుధవారం లెక్కల ప్రకారం, మూడు నియోజకవర్గాల్లో కలిపి మొత్తం 349 మంది ప్రజలు పునరావాస కేంద్రాలలో బస చేస్తున్నారని మేయర్ పేర్కొన్నారు. సర్కిల్-1 లో 178 మంది, సర్కిల్-2 లో 115 మంది, సర్కిల్-3 లో 53 మంది ఉంటున్నట్లు లెక్కలు తెలియజేశారు. ఇబ్బందులు పడుతున్న ప్రజలందరికీ కార్పొరేషన్ అండగా ఉంటుందని ఆమె హామీ ఇచ్చారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *