Breaking News

నగరంలో వర్షపు నీరు నిల్వ లేకుండా చర్యలు

-రోడ్డు పైన పడిన వృక్షాల తొలగింపు
-పునరావస కేంద్రాలలో ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మొంథ తుఫాన్ నేపథ్యంలో నగరం లో రోడ్డుపైన నిల్వలను ఎప్పటికప్పుడు గల్ఫర్లు, ఎయిర్ టెక్ మిషిన్స్, ఆయిల్ ఇంజిన్స్, మోటర్ పంపులతో తొలగిస్తున్నామని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.

అందులో భాగంగా భవానిపురం, ఊర్మిళ సుబ్బారావు నగర్, గవర్నర్పేట, సూర్యారావుపేట, జమ్మిచెట్టు సెంటర్, పిన్నమనేని పాలి క్లినిక్ రోడ్డు, నిర్మల కాన్వెంట్ రోడ్, ఎయిర్పోర్ట్ కారిడార్, ప్రసాదంపాడు మరియు నగరంలో నీటి నిల్వలు ఉన్న ప్రాంతాలలో ఎయిర్ టేక్ మిషిన్లు, గల్ఫర్లు, ఆయిల్ ఇంజన్లు, మోటర్ పంప్ సెట్లతో ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని అన్నారు. ముఖ్యంగా గవర్నర్పేటలోని ప్రజా వైద్యశాల వద్ద నాలుగు గలపర్లను పెట్టి వర్షపు నీరును తొలగించామని, తద్వారా ఆస్పత్రికి వెళ్లే ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నామని అన్నారు.

డ్రైన్ల లో పూడికలు తీయడమే కాకుండా అవుట్ ఫాల్ డ్రైన్ లలో డీసిల్టింగ్ పనులను శరవేగంగా చేస్తున్నామన్నారు. ప్రజారోగ్యం, ఇంజనీరింగ్ సిబ్బంది సమన్వయంతో డ్రైన్ల లో నీటిపారుదలకు ఎటువంటి ఆటంకం లేకుండా చూసుకుంటున్నామని తెలిపారు.

మంగళవారం రాత్రి తుఫాను నేపథ్యంలో ఈదురు గాలుల వల్ల రోడ్లమీద పడిపోయిన, ప్రమాదకరంగా ఉన్న కొమ్మలు దాదాపు 93 వృక్షాలను తొలగించామన్నారు. దాదాపు 500 మందికి పైగా ప్రజలను సురక్షితమైన ప్రదేశాలకు పంపించామని, అందులో 350 కి పైగా మంది పునరావస కేంద్రాల్లో నివసిస్తున్నారని, కొంతమంది వారి కుటుంబ సభ్యుల వద్దకు వెళ్లారని అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *