Breaking News

జక్కంపూడి పంచాయతీలో భోగవల్లి సత్రం ట్రస్టు కు చెందిన దేవాదాయ శాఖ భూమికి ఏ విధంగా ఎన్వోసీ మంజూరు చేస్తారు? : పోతిన వెంకట మహేష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు విజయవాడ నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ సోమ‌వారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో పోతిన వెంకట మహేష్ మాట్లాడుతూ భోగవల్లి సత్రం ట్రస్ట్ కు చెందిన కోట్ల రూపాయల విలువైన భూములను కారుచౌకగా కొట్టేసేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటరీ కుట్ర పన్నిందని, జక్కంపూడి పంచాయితీ ఏరియాలో పాములు కాలువ మలుపు వద్ద 10 కోట్ల రూపాయల విలువైన 2.75 యకరాల దేవాదాయశాఖ కు చెందిన భూమిని దేవాదాయ శాఖ మంత్రి ఓ ఎస్ డి అశోక్ ద్వారా కాజేసేందుకు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కోటరీ కుట్రపన్నారని అందుకే ఈ భూమికి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ మంజూరు చేయిస్తామని, అందుకు ఆ భూమిని మాకు కేవలం కోటి రూపాయలకే అమ్మకం చేయాలని మంత్రి  osd అశోక్ , అతని మామ పెరుమాళ్ళ. కాశీరావు, కొండపల్లి .బుజ్జి ,కొనకళ్ల. విద్యాధరరావు తో కలిసి నర్రా రవి కిరణ్ అనే వ్యక్తి పై 10 లక్షల రూపాయలు ఇచ్చి అగ్రిమెంట్ చేయించారని, అదే విధంగా ఏలూరు రోడ్ లో 8 కోట్ల రూపాయల విలువైన కమర్షియల్ స్థలాన్ని పేరుమళ్ళ. కాశీ రావు పేరు పై కోటిన్నర రూపాయలకు కొనుగోలు చేస్తామని 20 లక్షల రూపాయలతో ఎగ్రిమెంట్ చేసుకున్నారని,18 కోట్ల రూపాయల విలువైన స్థలాలను కేవలం రెండున్నర కోట్ల రూపాయలకే మంత్రి వెల్లంపల్లి కోటరీ కాజేయాలని చూశారని, ఈ వ్యవహారం అంతా ఏలూరు రోడ్డు రాజ్ టవర్స్ హోటల్ వద్ద దేవాదాయ శాఖకు చెందిన ఒక న్యాయ సలహాదారు ఇంటిలో ఉదయం 8 నుంచి 9 గంటల మధ్య 21. 3 .2021 జరిగిందని కావాలంటే సిసి టివి ఫుటేజ్ లు చెక్ చేసుకోవచ్చని, వన్ టౌన్ బ్రాహ్మణ వీధి లో వాసవి కన్యకా పరమేశ్వరి ఆర్య వైశ్య సత్రం లో అసలు ఈ వ్యవహారం జరగలేదని పోలీస్ శాఖ వారు కావాలనుకుంటే ఇక్కడ కూడా సిసి టివి ఫుటేజ్ ను తనిఖీ చేయాలని, ఈ డ్రామా అంతా 18 కోట్ల రూపాయల విలువైన స్థలాలను తక్కువ ధరకే కొట్టేయాలని కుట్ర ఉందని, ఇందులో కావాలనే మంత్రి సన్నిహితులు పోలీస్ శాఖను కూడా తప్పుదారి పట్టిస్తున్నారని, దేవాదాయశాఖ భూములను కాపాడాల్సిన ఓఎస్డీ అశోక్ దేవాదాయశాఖ భూములను అక్రమంగా కాజేయాలని చూస్తే అతని పై మంత్రి శ్రీను ఎందుకు కేసు నమోదు చేయించాలేదో అనే విషయంతో పాటు ఓఎస్డి మామ పెరుమాళ్ళ కాశి రావు కు అసలు దేవాదాయ శాఖ మంత్రి పేషిలో నిత్యం పనేంటో కూడా మంత్రి శీను సమాధానం ప్రజలకు చెప్పాలని, పది కోట్ల రూపాయల విలువైన ఆస్తి కొనుగోలు చేయడానికి ఇచ్చింది కేవలం పది లక్షలు లేనని అదేవిధంగా ఏలూరు రోడ్డు కమర్షియల్ స్థలం కొనుగోలు చేయడానికి ఇచ్చింది కూడా కేవలం 20 లక్షలు లేనని మరి మధ్యవర్తి పిఆర్వో శ్రీనివాస్ కు మూడు విడతలుగా 3 సార్లు 10 లక్షలు చొప్పున 30 లక్షలు ఎగ్రిమెంట్ ల పై సంతకం తీసుకోకుండానే ఏవిదంగా చెల్లిస్తారు అనే అనుమానం కలుగుతుందని, ఎక్కడైనా అమ్మకందారులు కొనుగోలుదారులు మీద ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు కానీ మధ్యవర్తి పై కేసు నమోదు చేయించడం వెనక కుట్ర కోణం దాగి ఉందని, పిఆర్వో శ్రీనివాస్ ఓ ఎస్ డి అశోక్, పెరుమల్లా .కాశీ రావు, మంత్రి కోటరీమొత్తం పై కేసు నమోదు చేయాలని, బెదిరింపులకు గురి చేయడం ద్వారా భోగవల్లి మురళి కృష్ణ చైతన్య గారిని ఆందోళనకు గురి చేసి ఈ స్థలాన్ని కాజేయాలని మంత్రి వెల్లంపల్లి కోటరీ కుట్ర ఇందులో దాగి ఉందన్నారు, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తెలియకుండానే ఓఎస్డీ అశోక్ ఇంత పెద్ద భూ వ్యవహారం నడిపించగలరాఅని, ఇదంతా మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ కు తెలిసేది జరుగుతుందని, ప్రజలను మరియు అధికారులను పక్కదారి పట్టించడానికే వీళ్లు ఒక పథకం ప్రకారం కథ నడుపుతున్నారని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ రూటే సెపరేట్ అని, చిన్న తప్పు చేస్తే సస్పెన్షన్ పెద్ద ఎత్తున అవినీతి చేస్తే ప్రమోషన్ ఇస్తారని, గతంలో కూడా దుర్గగుడి మాజీ ఈ ఓ సురేష్ బాబు వ్యవహారంలో కూడా చిన్న చిన్న తప్పులు చేసిన 15 మంది ఉద్యోగస్తులను సస్పెండ్ చేశారని, కోట్ల రూపాయల అవినీతి చేసిన సురేష్ బాబుకు మాత్రం ప్రమోషన్ ఇచ్చారని ,ఇప్పుడు కూడా అదే విధంగా ఓఎస్డి అశోక్ కోట్ల రూపాయల అక్రమాలు చేస్తే ఆయన్ని మాతృ సంస్థకు సరెండర్ చేస్తున్నారని పిఆర్వో శ్రీనివాస్ను మాత్రం సస్పెండ్ చేశారని, మంత్రి వ్యవహారం బీసీలకు ఒకలాగా ఓసీలకు మరొక లాగా చూస్తారనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని,నిజాయితీకి మారుపేరైన విజయవాడ పోలీస్ కమిషనర్ బత్తిన శ్రీనివాస్ మరియు పశ్చిమ ఏసిపి హనుమంతరావు ఈ కేసు విషయంలో లోతుగా దర్యాప్తు చేయాలని అసలు దోషులను మొత్తాన్ని ఎఫ్ఐఆర్లో చేర్చాలని తద్వారా దేవాదాయశాఖ ఆస్తులను కాపాడినవారవుతారన్నారు.

దేవాదాయశాఖ మంత్రిగా వెల్లంపల్లి శ్రీనివాస్ ఉండడం రాష్ట్ర ప్రజల దౌర్భాగ్యమని, దేవాలయాల భూములు కాపాడాల్సిన వ్యక్తి దోచుకుంటూ ఉంటే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయకుండా ఉండడానికి కారణం తాడేపల్లి ప్యాలెస్కు ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కి ముడుపులు అందుతున్నాయి అనడంలో ఏమాత్రం సందేహం లేదని, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అవినీతి లీలలు రోజు ఒక్కటి బయటకు వస్తున్నాయని నిజంగా ముఖ్యమంత్రి కి హిందూ దేవాలయాల ఆస్తుల పైన ఆచారవ్యవహారాల పైన నమ్మకం ఉంటే తక్షణమే మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి వారి చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్  పేషిలో అసలు కొనకళ్ళ విద్యాధరరావు వారంలో నాలుగైదు రోజుల పాటు ఎందుకు కూర్చుంటున్నారు కూడా మంత్రి సమాధానం చెప్పాలని కావాలంటే మంత్రి సీసీ టీవీ పుటేజ్ బయటపెట్టాలని డిమాండ్ చేశారు

Check Also

పేదల కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహోన్నత వ్యక్తి వంగవీటి మోహన రంగా

– వైసీపీ సెంట్రల్ నియోజకవర్గ సమన్వయకర్త మల్లాది విష్ణు విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పేద ప్రజల కోసం …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *