Breaking News

కూటమి ప్రధాన లక్ష్యం ప్రజల సంక్షేమం… : డా. పసుపులేటి హరిప్రసాద్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు జిల్లాలోని గుడిపాలా గ్రామంలో జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం శశి అధ్యక్షతన నిర్వహించబడింది. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్ మోహన్, తిరుపతి శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, జనసేన పార్టీ PAC సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ హస్తకళా నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ డా. పసుపులేటి హరిప్రసాద్ హజరయ్యారు

ఈ సందర్భంగా డా. పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ కూటమి గౌరవానికి విలువనిస్తూ ఆలస్యంగానైనా విచ్చేసిన చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ కి మరియు చారిత్రాత్మకమైన మెజారిటీతో గెలిచిన తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు కి తన హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కూటమి ప్రధాన లక్ష్యం ప్రజల సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధి, మరియు సుపరిపాలన అని తెలిపారు. పవన్ కళ్యాణ్ తన విలాసవంతమైన జీవితాన్ని త్యాగం చేసి ప్రజల కోసం రాజకీయాల్లోకి వచ్చారని, ఆయన ప్రజలను దుర్మార్గ పాలన నుండి రక్షించడమే లక్ష్యమని వివరించారు.

ఈ కార్యక్రమంలో చిత్తూరు పాయింట్ అఫ్ కాంటాక్ట్ కవితమ్మ, చిత్తూరు జిల్లా కార్యదర్శి యశ్వంత్, మాగేంద్ర, కిరణ్,పొన్నాయుడు, రాజారెడ్డి, చైతన్య, చిన్నా, కార్పొరేటర్ రఘు, తిరుపతి ముఖ్య నాయకులు జనసేన, బీజేపీ, టీడీపీ నాయకులు మరియు జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *