Breaking News

కార్తీక పౌర్ణమి సందర్భంగా ఘాట్ల వద్ద వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదు

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక పౌర్ణమి సందర్భంగా  ఘాట్ల వద్ద వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగరాదని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు.  బుధవారం తన పర్యటనలో భాగంగా కృష్ణవేణి ఘాట్, వినాయకుని గుడి, కెనాల్ రోడ్, దుర్గా ఘాట్ ప్రాంతాలన్నీ పర్యటించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ  కార్తీక పౌర్ణమి సందర్భంగా అమ్మవారి దర్శనానికి వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకోవాలని, ఘాట్ల వద్ద పారిశుద్ధ్య నిర్వహణ కచ్చితంగా జరగాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచాలని, భక్తులకు త్రాగునీటి సౌకర్యం కల్పించాలని, డ్రోన్ సర్వేలెన్సు ద్వారా ఎంత మంది భక్తులు వచ్చారు, అక్కడ పారిశుధ్య నిర్వహణ ఎలా ఉంది వంటి అంశాలపై ఎప్పటికప్పుడు తమకు నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు. మరో వైపు అన్న క్యాంటీన్లలో ఎటువంటి మరమ్మతులు  ఉండరాదని, అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ అన్నపూర్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *