Breaking News

లోఓల్టేజ్ సమస్య ఎక్కడైనా ఉంటే తక్షణమే పరిష్కరించాలి

-ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్ధానిక పీడబ్ల్యూడి గ్రౌండ్స్ వద్ద గల ఏపీసీపీడీసిఎల్ సర్కిల్ ఆఫీస్ సీఎండీ పి. పుల్లా రెడ్డి గురువారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఎస్ఈ లు, ఈఈ లతో పీఎం సూర్య ఘర్, రెవెన్యూ కలెక్షన్స్, సైక్లోన్ డ్యామేజెస్, ఆర్డీఎస్ఎస్ (Revamped Distribution sector Scheme)పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ పి. పుల్లా రెడ్డి మాట్లాడుతూ రెవెన్యూ వసూళ్లను నూరు శాతం సాధించాలని ఆదేశించారు. అదేవిధంగా వినియోగదారులకు ఇబ్బందులు తలెత్తకుండా నాణ్యమైన విద్యుత్తును అందిస్తూ ఎక్కడైనా లోఓల్టేజ్ సమస్య ఉంటే వాటిని వెంటనే పరిష్కరించాలన్నారు. అంతేకాకుండా పీఎం సూర్య ఘర్ పథకానికి సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే రాయితీపై అవగాహన కల్పించి, లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ప్రత్యేక ఆదేశాలు ఇవ్వటం జరిగింది. సమీక్ష సమావేశం లో ఏపీసీపీడీసిఎల్ డైరెక్టర్లు మురళీ కృష్ణ యాదవ్, టీ వి ఎస్ ఎన్ మూర్తి, వెంకటేశ్వర్లు, సి. జి. ఎమ్ లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *