Breaking News

రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన జాయింట్ కలెక్టర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎన్టీఆర్ జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ గురువారం విజయవాడ, రామవరప్పాడులో రేషన్ దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ దుకాణం ద్వారా కార్డుదారులకు అందుతున్న సేవలు, సరుకులకు సంబంధించిన రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం రామవరప్పాడులో అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించారు. ఈ కేంద్రం ద్వారా చిన్నారులు, గర్భిణీలు, బాలింతలకు అందుతున్న పౌష్టిక ఆహారం వివరాలను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులకు పూర్వ ప్రాథమిక విద్య అందిస్తున్న తీరును పరిశీలించారు. చిన్నారుల మేధో వికాసానికి నిర్దేశించిన పాఠ్య ప్రణాళికను కచ్చితంగా అమలు చేసేలా, ఆరోగ్యంపై నిరంతర పర్యవేక్షణ ఉండేలా సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు సకాలంలో నాణ్యమైన సరుకులు అందించడం జరుగుతుందన్నారు. ఎక్కడా ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేపడుతున్నట్లు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *