Breaking News

ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్ల నిర్మాణ పనులను పరిశీలించిన అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ 

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజారాజధాని అమరావతిలోని కీలక భవన సముదాయాల నిర్మాణ పనులు జరుగుతున్న అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్(ఏజిసి)లోని ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్లను సిఆర్డిఏ అడిషనల్ కమిషనర్ ఏ.భార్గవతేజ ఐఏఎస్ పరిశీలించారు. టవర్లు నిర్మిస్తున్న ప్రాంతంలో పనుల పురోగతిని చీఫ్ ఇంజినీర్ ఎం.వీ.రావు(HOD, GAD టవర్లు), ఇంజినీరింగ్ విభాగంలోని ముఖ్య అధికారులు..అడిషనల్ కమిషనర్ కి వివరించారు. నిర్దేశించిన లక్ష్యం మేరకు ఇంటిగ్రేటెడ్ ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్ల వద్ద పనులు పూర్తవ్వాలని అడిషనల్ కమిషనర్ గుత్తేదారులను, సంబంధిత అధికారులను ఆదేశించి టవర్ల వద్ద వినియోగిస్తున్న మెటీరియల్‌ను ఆయన పరిశీలించి పలు కీలక సూచనలు ఇచ్చారు. అలాగే టవర్లు నిర్మిస్తున్న సైట్‌లో కార్మికుల భద్రతకు చేపట్టాల్సిన అంశాలను సమీక్షించారు. అలాగే నవంబర్ 10న చెన్నై ఐఐటీ మద్రాస్ సివిల్ ఇంజినీరింగ్ విభాగానికి చెందిన ప్రొఫెసర్ల బృందం అమరావతిలో..ఏపీ సెక్రటేరియట్(HOD, GAD) ఐకానిక్ టవర్ల రాఫ్ట్ ఫౌండేషన్‌‌ను సందర్శించనుంది. బృందం పర్యటనకు ముందుగా, అదనపు కమిషనర్ నిపుణులకు అవసరమైన అన్ని పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసి, వచ్చిన ఫలితాలను సమీక్ష కోసం సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా రీట్రోఫిటింగ్ చర్యలు చేపట్టే అంశంపై తగిన నిర్ణయం తీసుకోనున్నట్లు అడిషనల్ కమిషనర్ స్పష్టం చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *