-సస్టైనబుల్ సిటీస్ – ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్మెంట్స్అంశంపై ప్రసంగించిన మంత్రి నారాయణ
-దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి వివరించిన మంత్రి
-అమరావతి ద్వారా రాజధాని నిర్మాణం మాత్రమే కాదు….భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామన్న మంత్రి
విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
అమరావతి రాజధానిని ప్రపంచ స్థాయి ప్రమాణాలతో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ సిటీగా నిర్మిస్తున్నామని పురపాలక శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేసారు..అమరావతి నిర్మాణం ద్వారా భవిష్యత్తు తరాలకు స్ధిరమైన రాజధానిని అందిస్తున్నామన్నారు…విశాఖలో జరుగుతున్న 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సులో ప్లీనరీ సెషన్ లో స్థిరమైన నగరాలు – ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్మెంట్స్ అనే అంశంపై మంత్రి నారాయణ ప్రసంగించారు…అమరావతి ప్రజారాజధానిని ప్రపంచ స్థాయి రాజధానిగా నిర్మించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను దేశవిదేశాల పారిశ్రామికవేత్తలకు మంత్రి నారాయణ వివరించారు…అటు అమరావతిపై నిపుణులతో పాటు పెట్టుబడిదారులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.సదస్సులో మంత్రి నారాయణ అమరావతిపై ఇంకా ఏమన్నారంటే…
అమరావతి ప్రజా రాజధాని 217 చ. కి.మీ.విస్తీర్ణంతో దేశంలోని రాజధాని నగరాల్లో ప్రత్యేకంగా నిలుస్తుంది – దేశంలోని అతిపెద్ద ల్యాండ్ పూలింగ్ పథకం (LPS)లో స్వచ్ఛందంగా పాల్గొన్న 29,000 కంటే ఎక్కువ మంది రైతుల నుంచి అమరావతి జన్మించిందన్నారు. అఖండ మద్దతు నుండి జన్మించింది.అమరావతిని ఆర్థికంగా, శక్తివంతమైన, పర్యావరణపరంగా స్థిరమైన,రాబోయే తరాలకు అవకాశాలను సృష్టించేలా నిర్మిస్తున్నామన్నారు..
2050 వ సంవత్సరం నాటికి 3.5మిలియన్ల జనాభాతో 35బిలియన్ డాలర్ల జీడీపీ తో 1.5 మిలియన్ల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యంగా పెట్టుకున్నాం.సింగపూర్ ప్రభుత్వం ఇచ్చిన మాస్టర్ ప్లాన్ తో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి మార్గదర్శకత్వంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో అమరావతి నిర్మాణం జరుగుతుందని మంత్రి అన్నారు…సుమారు 90 కిమీ పొడవైన ఇన్నర్ రింగ్ రోడ్డు,190 కిమీల మేర ఔటర్ రింగ్ రోడ్డు నిర్మాణానికి ఇప్పటికే అనుమతి వచ్చింది..
దేశంలోనే రద్దీగా ఉండే విజయవాడ రైల్వే స్టేషన్ కేవలం 10 కిమీల మేర ఉండగా….కొత్తగా నిర్మిస్తున్న హైదరాబాద్ – నంబూరు రైల్వే లైన్ కేపిటల్ సిటీని ఆనుకుని వెళ్తుందన్నారు..గన్నవరం ఎయిర్ పోర్ట్ తో పాటు కొత్తగా మరో అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు మచిలీపట్నం పోర్టు కనెక్టవిటీ అమరావతికి ఉంది..30 శాతం బ్లూ -గ్రీన్ రాజధానిగా 7 సహజమైన ద్వీపాలు,21 కి మీ నదీ తీరం అమరావతిని అత్యంత అనుకూల వాతావరణం ఉన్న రాజధానిగా మారుస్తాయన్నారు.
అమరావతిని నివాసయోగ్యమైన ప్రజా కేంద్రిత రాజధానిగా నిర్మిస్తున్నామని మంత్రి తెలిపారు.5-10-15 నిమిషాల నివాసయోగ్యంగా ప్రణాళికా బద్దంగా నిర్మాణం జరుగుతుందన్నారు.అమరావతిలో ఉండే ప్రజలు అత్యవసర సేవలకు 5 నిమిషాలు,వినోద ప్రదేశాలకు 10 నిమిషాలు,పని ప్రాంతాలకు 15 నిమిషాల్లో చేరుకునేలా నివాసయోగ్యంగా అమరావతి నిర్మాణం ఉంటుందన్నారు…360 కి.మీ ట్రంక్ రోడ్లు,1500 కి.మీ రోడ్డు నెట్వర్క్ తో ట్రాఫిక్ సజావుగా సాగేలా ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి చెప్పారు…అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు,తాగు నీరు,విద్యుత్ లైన్లు,కమ్యూనికేషన్ లైన్లు,ప్రణాళికాబద్ధమైన ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ తో ఆర్ధిక వృద్ధికి దన్నుగా అమరావతి ఉండనుందన్నారు..
మరోవైపు దాదాపు 91,000 కోట్లతో ప్రభుత్వ భవనాలు,రోడ్లు,మౌళిక వసతులు,వరద నివారణ పనులు కు ప్రణాళికలు రూపొందించినట్లు మంత్రి నారాయణ చెప్పారు..రాబోయే మూడేళ్లలో 51,000 కోట్ల విలువైన పనులు పూర్తి చేసేలా ఇప్పటికే టెండర్లు పూర్తి చేశామన్నారు…ఇలాంటి ప్రపంచ స్థాయి మౌళిక వసతులతో అమరావతి రాజధాని సుస్థిరమైన రాజధానిగా మారుతుందని మంత్రి నారాయణ స్పష్టం చేసారు..ఇప్పటికే అమరావతిలో 25,000 కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని…విట్ ,ఎస్ ఆర్ ఎం వంటి విద్యా సంస్థలు,కిమ్స్, బసవతారకం వంటి ఆసుపత్రులు,హిల్టన్,మారియట్,నోవాటెల్ వంటి హోటల్స్,బ్యాంకులు,,కేంద్ర ప్రభుత్వ సంస్థలు పెట్టుబడులకు ముందుకొచ్చాయన్నారు మంత్రి.రతన్ టాటా హబ్,క్వాంటం వ్యాలీ తో బలమైన నాలెడ్జి సెంటర్ గా అమరావతి మారనుంది.భాగస్వామ్య సదస్సతులో 40,000 కోట్ల పెట్టుబడులకు MOU లు కుదిరాయన్నారు మంత్రి.
అమరావతి ద్వారా రాజధాని నిర్మాణం మాత్రమే కాదు….భవిష్యత్తు తరాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామని మంత్రి నారాయణ తెలిపారు.
ఈ సమావేశంలో మంత్రి నారాయణతో పాటు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి సురేష్ కుమార్,సీఐఐ ప్రతినిధులతో పాటు పలువురు ప్రముఖ పెట్టుబడిదారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News