Breaking News

శ్రీకాకుళం ఎయిర్ పోర్టు నిర్మాణానికి రంగం సిద్ధం

-ముందుకొచ్చిన ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా
-సీఎం చంద్రబాబు సమక్షంలో కుదిరిన ఎంఓయూ

విశాఖపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఉత్తరాంధ్రకు మరో ఎయిర్ పోర్టు రానుంది. శ్రీకాకుళంలో నిర్మించ తలపెట్టిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సంబంధించి ఎయిర్ పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఆంధ్రప్రదేశ్ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మధ్య ఈమేరకు అవగాహనా ఒప్పందం కుదిరింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సమక్షంలో అధికారులు ఎంఓయూ పత్రాలు మార్చుకున్నారు. శ్రీకాకుళం జిల్లాకు ఎయిర్ పోర్ట్ రాకతో ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ పెరుగుతుందని, అలాగే పర్యాటక రంగానికి దోహదపడుతుందని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అన్నారు. ఎయిర్ పోర్ట్ నిర్మాణంతో ఈ ప్రాంతంలో ఆర్ధిక వృద్ధికి ఊతం లభిస్తుందని సీఎం అన్నారు. ఎయిర్ పోర్టు నిర్మాణానికి ప్రస్తుతం స్థల పరిశీలన జరుగుతోంది. మౌలిక వసతులు, రెగ్యులేటరీ అనుమతులపై ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, ఏపీ ఎయిర్ పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కలిసి పనిచేయనున్నాయి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *