-వనసమారాధనలు ఐక్యతకు చిహ్నాలు
-నగరాల వనసమారాధన లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్లడి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్తీక మాసంలో చేసే పూజ కార్యక్రమాలు వల్ల ఎంతో పుణ్యఫలం లభిస్తుంది. ప్రజలందరూ ఒక చోట కలిసి భోజనం చేయటం ఐక్యతకు చిహ్నమని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం ఆధ్వర్యంలో జక్కండపూడి పాములకాలవ దగ్గర నగరవనం అటవీ శాఖ పార్క్ ప్రాంగణంలో ఆదివారం వనసమారాధన కార్యక్రమం జరిగింది.
ఈ కార్యక్రమానికి ఎంపీ కేశినేని శివనాథ్ ముఖ్యఅతిథిగా హాజరై పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం నాయకులు ఎంపీ కేశినేని శివనాథ్ కు ఘన స్వాగతం పలికారు. అలాగే ఎంపీ కేశినేని శివనాథ్ ను సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన చిన్నారుల నృత్య ప్రదర్శనను ఎంపీ కేశినేని శివనాథ్ అభినందించారు.
ఈ సందర్భంగా ఎంపీకేశినేని శివనాథ్ మాట్లాడుతూ నగరాల వనసమారాధనలో పాల్గొనటం ఎంతో ఆనందంగా వుందన్నారు. నగరాల అభివృద్ది, సంక్షేమంతో పాటు వారి అభ్యున్నతికి కృషి చేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బాయిన బెనర్జీ, ప్రధాన కార్యదర్శి వి.శ్రవణ్ కుమార్, ఎన్టీఆర్ జిల్లా ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం అధ్యక్షుడు గూడెల మణికంఠ, సంఘం నాయకులు రాయన అరుణ్ కుమార్, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం బోర్డ్ మెంబర్ సుఖాసి సరిత, ఎపీ నగరాల సంక్షేమ అభివృద్ది కార్పొరేషన్ డైరెక్టర్లు సుఖాసి కిరణ్, బేవర సాయి
సుధాకర్, పశ్చిమ నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.మాధవ, చిట్టినగర్ దేవస్థానం సభ్యులు, ఆంధ్ర ప్రదేశ్ నగరాల యువజన సంఘం సభ్యులతో పాటు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News