Breaking News

కార్తీక వ‌న స‌మారాధ‌న‌లు సమాజ సమైక్యత, మానవ సంబంధాలు పెంపొందించ‌టానికి దోహ‌ద‌ప‌డ‌తాయి

-ప్రకృతిని ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త మ‌నంద‌రిపైన ఉంది
-విజ‌య‌వాడ నాగ‌వంశం వ‌న‌స‌మారాధ‌న‌లో ఎంపీ కేశినేని శివనాథ్ వెల్ల‌డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమాజ సమైక్యతకు, మానవ సంబంధాలు పెంపొందించుకోవడానికి కార్తీక మాస వ‌న‌సమారాధనలు దోహదపడతాయని విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. . విజ‌య‌వాడ నాగ వంశం సంఘం ఆధ్వ‌ర్యంలో కొత్తూరు తాడేప‌ల్లి లోని బుద్దావెంక‌న్న తోట‌లో ఆదివారం వనసమారాధన కార్య‌క్ర‌మం జ‌రిగింది.

ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యఅతిథిగా ఎంపీ కేశినేని శివ‌నాథ్, రాష్ట్ర నూర్ బాషా, దూదేకుల సంక్షేమ కార్పొరేష‌న్ చైర్మ‌న్ నాగుల్ మీరా, రాష్ట్ర నాగ‌వంశం సంక్షేమ‌,అభివృద్ది కార్పొరేష‌న్ చైర్మ‌న్ ఎరుబోతు ర‌మ‌ణారావు ల‌తో క‌లిసి పాల్గొన్నారు. ఈ కార్య‌క్ర‌మానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివ‌నాథ్ కు విజ‌య‌వాడ నాగ వంశం సంఘం నాయ‌కులు ఘ‌న స్వాగ‌తం ప‌ల‌క‌టంతో పాటు గ‌జ‌మాల‌తో స‌త్క‌రించారు. అనంత‌రం ఎంపీ కేశినేని శివనాథ్ పూజ కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ మాట్లాడుతూ ప్ర‌కృతి ప‌రిర‌క్షించాల్సిన బాధ్య‌త ప్ర‌జ‌లంద‌రిపైన వుంద‌న్నారు. పిల్ల‌ల‌కు చిన్న‌త‌నం నుంచే సంప్రాదాయ‌లు, విలువలు నేర్పించ‌టంతో పాటు ప్ర‌కృతి గొప్ప‌త‌నం, ప్ర‌కృతి ప‌రిర‌క్ష‌ణ అవ‌గాహ క‌ల్పించాల‌న్నారు. నాగ‌వంశీయుల సంక్షేమం, అభివృద్ధికి త‌న వంతు కృషి చేస్తాన‌ని తెలిపారు.

ఈ కార్య‌క్ర‌మంలో ఎన్టీఆర్ జిల్లా టిడిపి అధికార ప్ర‌తినిధి ఎరుబోతు రామారావు, సాలూరు మున్సిప‌ల్ మాజీ చైర్మ‌న్ జ‌ర‌జాడ ఈశ్వ‌ర‌రావు, రాష్ట్ర నాగ‌వంశం సంక్షేమం, అభివృద్ది కార్పొరేష‌న్ డైరెక్ట‌ర్లు గాడు అప్ప‌ల నాయుడు, మొక‌ర ఆదిబాబు, నాగ‌వంశ సాధికార‌త స‌భ్యులు మ‌ద్దెల వైకుంఠ‌రావు ల‌తో పాటు విజ‌య‌వాడ నాగవంశం సంఘం స‌భ్యులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

భారీ వర్షాల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి

-జ్వరాలు, విరేచనాల కేసులు పెరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలి. -మందులు, అంబులెన్సుల విష‌యంలో ముంద‌స్తు చ‌ర్య‌లు చేప‌ట్టాలి -వైద్యులు, సిబ్బంది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *