విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాహిని చారిటబుల్ ఫౌండేషన్ (VCF) మరియు Unicef వారు సంయుక్తంగా ఈరోజు విజయవాడ గాంధీనగర్ లోని కందుకూరి కళ్యాణ మండపంలో జిల్లా స్థాయి వరల్డ్ టాయిలెట్ డే కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది.కార్యక్రమానికి ముఖ్య అతిథులు పి డి ఐసిడిఎస్ ఎస్కె రుక్సానా సుల్తానా బేగం, జిల్లాలోని సి డి పి ఓ లు మరియు ఐ సి డి ఎస్ సూపర్వైజర్ లు హాజరు కాగా, ముందుగా మనోజ్ కుమార్ లీడ్ వాష్ ఫ్రం VCF, వరల్డ్ టాయిలెట్ డే యొక్క ప్రాముఖ్యత మరియు సేఫ్ టాయిలెట్ లను శానిటేషన్ విషయంలో అవగాహన కలిగి ఉండాలని, మరియు ఈ అంశాలపై అందరూ కలిసి పనిచేయాలని తెలిపారు అనంతరం పి డి గారు మాట్లాడుతూ రోజువారి కార్యక్రమాలతో పాటు టాయిలెట్ వాడటం మరియు శానిటేషన్ యొక్క ప్రాముఖ్యత విషయాలు అలాగే ఆరోగ్యం మరియు డిగ్నిటీ గురించి అవగాహన కల్పించాలని తెలియచేశారు. అనంతరం వరల్డ్ టాయిలెట్ డే కి సంబంధించిన కొన్ని IEC మెటీరియల్స్, పోస్టర్లు ఆవిష్కరించటం జరిగింది. కార్యక్రమంలో పిడి ఐసిడిఎస్ సి డి పి ఓ లు మరియు VCF సభ్యులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News