Breaking News

మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి కి శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే బొండా ఉమా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సింగ్ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం నందు సోమవారం ఆంధ్ర రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా జనాబ్ మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి, ప్రభుత్వ విప్, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు ని మర్యాదపూర్వకంగా కలిసి వారిని దుశ్శాలువాను కప్పి గౌరవించగా బోండా ఉమామహేశ్వరరావు కూడా ఉర్దూ అకాడమీ చైర్మన్ గా నియమితులైన మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి కి శుభాకాంక్షలు చెబుతూ శాలువాతో సత్కరించడం జరిగింది.
ఈ సందర్భంగా బొండా ఉమా మాట్లాడుతూ జనాబ్ మొహమ్మద్ ఫారూఖ్ షిబ్లి నాయకత్వంలో ఉర్దూ అకాడమీ మరింత అభివృద్ధి చెందుతుందని, రాష్ట్రంలో ఉర్దూ భాషాభివృద్ధికి, సంస్కృతి పరిరక్షణకు గొప్ప కృషి చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఉర్దూ భాషా సంస్కృతులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ నియామకం ద్వారా ఆ నిబద్ధత మరింత స్పష్టమైందని ఆయన అన్నారు. ఈ ములాఖాత్ లో యం.హెచ్.పి.ఎస్ స్టేట్ మీడియా కోఆర్డినేటర్ అబ్దుల్ గఫూర్, షేక్ బాబు, షమ్మీ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *