Breaking News

ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక

-విజయవాడ నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఉండాలని విజయవాడ నగరపాలక సంస్థ ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ అన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను, విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల కమాండ్ కంట్రోల్ రూమ్ లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికను ఇన్చార్జి కమిషనర్ డాక్టర్ డి. చంద్రశేఖర్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇంచార్జ్ కమిషనర్ మాట్లాడుతూ ప్రతి సమస్యను క్షేత్రస్థాయిలో అధికారులందరూ పరిశీలించాలని అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందుకున్న ఫిర్యాదులకు అధికారులు ఫిర్యాదు చేసిన వారి దగ్గరికి వెళ్లి సమస్య ఏంటో క్షేత్రస్థాయిలో తెలుసుకొని, వాటిని త్వరగా పరిష్కరించి, ఆ నివేదికను ప్రభుత్వానికి సమర్పించాలన్నారు. ఈ సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో 17 ఫిర్యాదులు అందగా అందులో పట్టణ ప్రణాళిక సంబంధించినవి 6, ఇంజనీరింగ్ 5, పబ్లిక్ హెల్త్ 1, హార్టికల్చర్ 2,పి ఓ యుసిడి 2, ఎస్టేట్ 1 మొత్తం కలిపి 17 ఫిర్యాదులను అందుకున్నారు అధికారులు.

ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ (జనరల్) ఏ. రవీంద్రరావు, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కే. అర్జునరావు, చీఫ్ ఇంజనీర్ i/c పి.సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) జి. సృజన, ఇంచార్జ్ పర్యవేక్షణ ఇంజనీర్ (వర్క్స్) శ్రీనివాస్ రెడ్డి, జాయింట్ డైరెక్టర్ అమృత్ డాక్టర్ లత, ఎస్టేట్ ఆఫీసర్ ఎ. శ్రీధర్, డిప్యూటీ డైరెక్టర్ అఫ్ హార్టికల్చర్ చంద్రశేఖర్, వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

వర్షాల వేళ పంటల పరిస్థితిపై జేసీ ఇల‌క్కియ పరిశీలన

– క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌టించి రైతుల‌తో మాట్లాడిన జాయింట్ కలెక్ట‌ర్‌ – పంటలకు నష్టం వాటిల్లకుండా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని అధికారుల‌కు ఆదేశాలు …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *