-అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి చొరవ చూపిన కూటమి నాయకులు..
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎమ్మెల్యే సుజనా చౌదరి నిర్దేశత్వంలో భవానిపురంలో నిర్వహించిన ప్రజా దర్బార్ కి విశేష స్పందన లభించింది. హెచ్ బి కాలనీలోని విఎంసీ కళ్యాణమండపంలో, సోమవారం ఉదయం జరిగిన ప్రజా దర్బార్ లో పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్, ఎన్టీఆర్ ఆ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్, టీడీపీ నేతలు బీజేపీ జనసేన పార్టీల కార్పొరేటర్లు, వివిధ డివిజన్ల అధ్యక్షులు,
బాధితులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. అధిక సంఖ్యలో అర్జీదారుల సమస్యల వినతి పత్రాలు తీసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ప్రజల సమస్యల పరిష్కారానికి చొరవ చూపారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా దర్బార్ కార్యక్రమం నిలుస్తుందని అన్నారు. ప్రజా సమస్యలను పరిష్కరిస్తూ వారి కలలను సాకారం చేస్తూ ప్రధాని మోడీ నాయకత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. సోమవారం పశ్చిమలో జరిగిన ప్రజా దర్బార్ లో 989 సమస్యలను ప్రజలు తెలిపారని ప్రజా సమస్యల పరిష్కార లాగిన్ లో ఎంటర్ చేసి పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రజలకు జవాబుదారితనంగా ఉండాలని వారి సమస్యలను పరిష్కరించేందుకు భవానిపురం ఎన్డీఏ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటుచేసి ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. పశ్చిమ లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి , పశ్చిమ అభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ వహిస్తూ విఎంసి ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ సంబంధిత విభాగాల అధికారులతో ఎమ్మెల్యే సుజనా తరచూ సమీక్షలు నిర్వహిస్తున్నారని తెలిపారు.
జనసేన పార్టీ కార్పొరేటర్ మహాదేవు అప్పాజీరావు మాట్లాడుతూ ప్రతినెలా ప్రజా దర్బార్ నిర్వహిస్తూ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. వెస్ట్ ను బెస్ట్ చేసేలా ఎమ్మెల్యే సుజనా నిరంతరం పని చేస్తున్నారని తెలిపారు.
మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కూటమి నాయకులు అందరితో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఎమ్మెల్యే కార్యాలయం కూడా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండటం వలన అనేక సమస్యలు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని తెలిపారు. సుజనా మిత్ర కో ఆర్డినేటర్ లు సైతం సమస్యలను పరిష్కరించడంలో చొరవ చూపడం అభినందనీయ మన్నారు. సుజనా ఫౌండేషన్ ద్వారా కూడా ఎమ్మెల్యే సుజనా చౌదరి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని విద్యా, వైద్య రంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, మరుపిళ్ల రాజేష్, మహాదేవు అప్పాజీరావు, మైలవరపు మాధురి లావణ్య, అత్తలూరి ఆదిలక్ష్మి పెదబాబు, మైలవరపు రత్నకుమారి దుర్గారావు, మాజీ కార్పొరేటర్ అబ్దుల్ ఖాదర్, జనసేన పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మల్లెపు విజయలక్ష్మి , 42 వ డివిజన్ జనసేన అధ్యక్షురాలు తిరుపతి అనూష, 43 వ డివిజన్ జనసేన అధ్యక్షుడు బొల్లేపల్లి కోటేశ్వరరావు,42 వ డివిజన్ టీడీపీ అధ్యక్షుడు పత్తి నాగేశ్వరరావు ఎన్డీఏ కార్యాలయ సిబ్బంది, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News