విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ వికలాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ బ్యాంకుల్లో పనిచేస్తున్న ఉద్యోగులందరిలో దివ్యాంగుల గురించి అవగాహన కల్పిస్తున్నామని ఆలిండియా యూకో బ్యాంక్ దివ్యాంగజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఏ.శ్రీనివాసులు తెలియజేశారు. స్థానిక గాంధీనగర్ ప్రెస్క్లబ్లో బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డిసెంబర్ 3 తేదీని అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం గా ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారని, ఈరోజు దివ్యాంగుల హక్కులు మరియు సంక్షేమాన్ని ప్రోత్సహించడానికి ఉద్దేశించబడిందని అన్నారు. దివ్యాంగులకు 2016 ఈ.డబ్ల్యు.డి చట్టంలో వారికి సూచించిన హక్కులు మరియు సమానత్వాలు గురించి అవగాహన కలిగించడం ముఖ్య ఉద్దేశమని అన్నారు. ప్రభుత్వం చట్టాలు చేస్తున్నారు గాని అవి క్షేత్రస్థాయిలోసరిగా అమలు చేయడం లేదని దివ్యాంగ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చే విధానాలను అమలు చేయడంలో దివ్యాంగుల గురించి అవగాహన వారిని ప్రోత్సహించడంలో మా సంఘం కీలకపాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు. అంతేకాకుండా ప్రభుత్వం ఆధ్వర్యంలో సామాజిక న్యాయ సంక్షేమ శాఖ మరియు దివ్యాంగ శాఖతో కలిసి మా సంఘం పనిచేస్తుందని ఈ విధానాలు ప్రభుత్వ కార్యక్రమాలు మరియు మార్గదర్శకాలకు అ అనుగుణంగా ఉండేలా చూడడం ద్వారా దివ్యాంగ ఉద్యోగులకు సహాయకారిగా ఉంటుందని ఆయన అన్నారు. దివ్యాంగ బ్యాంకు ఉద్యోగులు ఎదుర్కొంటున్న సవాళ్లను, పరిష్కార మార్గాలను ఆయన తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఎస్ ఏడుకొండలు, ఎం శ్యామ్, శివ తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News