-డిసేబిలిటీ క్రీడాకారులను సత్కరించి సన్మానించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు మరియు ఏండి ఎస్ భరణి.
-తొలి మహిళా ప్రపంచ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్‌లో ప్రతిభ కనబరిచిన ఆంధ్రప్రదేశ్ కి చెందిన క్రీడాకారులు.
-మడగశిర కు చెందిన దీపికా, పాడేరుకు చెందిన పి. కరుణా కుమారి లను సన్మానించిన శాప్ ఛైర్మన్ రవినాయుడు మరియు ఏండి ఎస్ భరణి
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వరల్డ్ డిసేబిలిటీ డే సందర్భంగా ఈ రోజు విజయవాడలోని శాప్ ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డిసేబిలిటీ క్రీడాకారులను శాప్ చైర్మన్ అనిమిని రవి నాయుడు, శాప్ ఎండి భరణి IFS తో కలిసి ఘనంగా సత్కరించారు. క్రీడా రంగంలో ప్రతికూల పరిస్థితులను జయించి రాష్ట్రానికి పేరు ప్రఖ్యాతలు తీసుకువస్తున్న ప్రతిభావంతుల విజయాలను చైర్మన్ అభినందించారు.
ఈ సందర్భంగా రవి నాయుడు మాట్లాడుతూ, డిసేబిలిటీ క్రీడాకారులు చూపుతున్న పట్టుదల, కృషి మరియు ప్రతిభ నిజంగా రాష్ట్రానికి గర్వకారణం. వీరి ఎదుగుదలకు, భవిష్యత్తు విజయాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుంది. శాప్ ద్వారా అవసరమైన సహకారం నిరంతరం అందిస్తాము అని పేర్కొన్నారు. అలాగే ఇటీవల కొలంబోలో జరిగిన తొలి మహిళా ప్రపంచ బ్లైండ్ క్రికెట్ టోర్నమెంట్‌లో భారత జట్టు విశేష విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన దీపికా (మడగశిర), అలాగే జట్టులో ప్రతిభ కనబరిచిన పి. కరుణా కుమారి (పాడేరు) లను శాప్ చైర్మన్ రవి నాయుడు, వైస్ చైర్మన్ భరణి IFS తో కలిసి శాప్ ప్రధాన కార్యాలయంలో ప్రత్యేకంగా సత్కరించి అభినందనలు తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ రవినాయుడు పేర్కొంటూ భారత బ్లైండ్ మహిళా క్రికెట్ జట్టులో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారిణులు దీపికా మరియు కరుణా కుమారిల అసాధారణ ప్రదర్శన రాష్ట్రానికి అపార గర్వం. వీరి ప్రతిభ భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ విజయాలను అందుకుంటుందని నమ్ముతున్నాను అని అన్నారు. అలాగే ఈ ప్రభుత్వం వారికి అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో శాప్ బోర్డు సభ్యులు సంతోష్, ఎన్టీఆర్ జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారులు, అలాగే వివిధ విభాగాల డిసేబిలిటీ క్రీడాకారులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News