Breaking News

తప్పిపోయిన యువతి కేసు జనసేన జోక్యంతో రెండు రోజుల్లోనే పరిష్కారం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
చిత్తూరు నియోజకవర్గంలో మూడు నెలల క్రితం తప్పిపోయిన ఒక యువతిపై ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు ఇటీవల జనసేన పార్టీ నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో తమ విన్నపాన్ని సమర్పించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉండే జనవాణి లక్ష్యాన్ని దృష్టిలో ఉంచుకొని, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకున్నారు. కుటుంబ సభ్యుల విన్నపం అందుకున్న వెంటనే, పవన్ కళ్యాణ్ ఈ కేసును ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు, జనసేన PAC సభ్యులు డా. పసుపులేటి హరిప్రసాద్ కి మరియు చిత్తూరు జిల్లా ఎస్పీ  తుషార్ దూది కి తెలియజేసి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పోలీసు అధికారులు అత్యంత వేగం, కర్తవ్యనిష్ఠతో విచారణను ముందుకు తీసుకొని కేవలం రెండు రోజుల్లోనే ఆ యువతిని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చడం ప్రశంసనీయ విషయం.

ఈ నేపథ్యంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తరఫున డా. హరిప్రసాద్ బాధిత కుటుంబాన్ని ప్రత్యక్షంగా కలిసిచూడడంతో పాటు, కేసును ఎంతో బాధ్యతగా, సమయస్ఫూర్తితో పరిష్కరించినందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ దూది కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జనసేన పార్టీ ప్రజల సమస్యలను తక్షణమే వినడం, స్పందించడం, పరిష్కారం అందించడం అనే లక్ష్యసాధన దిశగా ఈ సంఘటన ఒక బలమైన ఉదాహరణగా అని తెలియచేసారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *