Breaking News

దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలి…

జగ్గయ్యపేట, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా సీతారాంపురం, జగ్గయ్యపేట ప్రాథమిక ఉన్నత పాఠశాలలో విభిన్న ప్రతిభావంతులైన విద్యార్థులతో ప్రత్యేక ముఖాముఖి కార్యక్రమం నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రి నెట్టెం రఘురాం విద్యార్థులను ప్రోత్సహిస్తూ ప్రసంగించారు.

ఈ సందర్భంగా రఘురాం మాట్లాడుతూ, “విభిన్న ప్రతిభావంతులైన దివ్యాంగులకు అండగా ఉండటం తెలుగుదేశం పార్టీ పుట్టుకతో వచ్చిన విలువ. దివ్యాంగులు ఏ రంగంలోనైనా మెరుగైన అవకాశాలు పొందాలని, వారి జీవిత ప్రమాణాలు పెరుగాలని మా పార్టీ ఎల్లప్పుడూ కృషి చేస్తోంది,” అన్నారు. దేశంలో ఏ రాష్ట్రం ఇవ్వని విధంగా దివ్యాంగులకు నెలకు రూ. 6,000 పెన్షన్ అందించడం కూటమి ప్రభుత్వ సంకల్పబలానికి నిదర్శనమని రఘురాం పేర్కొన్నారు. విద్య, వైద్యం, స్వయం ఉపాధి, ఉద్యోగావకాశాలు అన్నింటిలోనూ దివ్యాంగులు ఆత్మనిర్భరులుగా ఎదగడానికి ప్రభుత్వం అన్ని విధాల సహాయం అందిస్తున్నదని వివరించారు. దివ్యాంగులు ఎదుర్కొనే అడ్డంకులను తొలగించి, వారి కోసం మరింత అనుకూలమైన వాతావరణం సృష్టించడం కూడా ప్రభుత్వ ప్రాధాన్యతా విధానమని ఆయన స్పష్టం చేశారు. ఇదే కార్యక్రమంలో భాగంగా, జగ్గయ్యపేట స్మైలి హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటపోటీల్లో విజయం సాధించిన పిల్లలకు నెట్టెం రఘురాం చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. పిల్లల ప్రతిభను ప్రోత్సహించే ఇలాంటి కార్యక్రమాలు వారికి నమ్మకం, ఉత్సాహం, భవిష్యత్‌లో సాధించాలనే ధైర్యాన్ని పెంపొందిస్తాయని ఆయన అభినందించారు.

ముగింపు ప్రసంగంలో రఘురాం, “ప్రతి దివ్యాంగుడు సమాజంలో గౌరవనీయ స్థానం సంపాదించాలని, పాఠశాలలో మౌలిక వసతులకు కృషి చేయాలని ఎలాంటి సహాయం కావాలన్నా ప్రభుత్వం తరఫున ప్రభుత్వంతో మాట్లాడి సహాయ సహకారాలు అందిస్తాననిఆత్మవిశ్వాసంతో తమ స్వప్నాలను సాధించాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను,” అని అన్నారు.

ఈ కార్యక్రమంలో నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరాం పదో వార్డ్ కౌన్సిలర్ కన్నెబోయినా రామలక్ష్మి పట్టణ పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వరరావు ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధికార ప్రతినిధి తాళ్లూరు వెంకటేశ్వరరావు షైక్ అన్వార్ మాజీ కౌన్సిలర్ కూరపాటి సైదులు చిల్లకల్లు మాజీ సర్పంచ్ డేవిడ్ MEO చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *