-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర శుక్రవారం ఉదయం తన పర్యటనలో భాగంగా లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్డు, ఏఎస్ రామారావు రోడ్డు, రమేష్ హాస్పిటల్ రోడ్డు, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్డు, ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్, పటమట హై స్కూల్ రోడ్డు, పంట కాలువ రోడ్డు, మహాత్మా గాంధీ రోడ్డు, ప్రాంతాలన్నీ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా ఆటోనగర్ గార్బేజ్ ట్రాన్స్ఫర్ స్టేషన్ పరిశీలించారు. ప్రమాదాలు జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు, వాహనాల నిరంతర పర్యవేక్షణ ఎంతో ముఖ్యమని, అధికారులు నగరపాలక సంస్థ వారి సొంత వాహనాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుండాలని, అద్దెకు తీసుకునే వాహనాలైనా ఏజెన్సీ వారి సమన్వయంతో కండిషన్లో ఉండేటట్టు ఎప్పటికప్పుడు చూసుకోవాలని అధికారులను ఆదేశించారు.
తదుపరి లబ్బీపేట వాటర్ ట్యాంక్ రోడ్డులో మరుగుదొడ్ల మరమ్మతులను త్వరితగతిన పూర్తి చేయాలని, రమేష్ హాస్పటల్ రోడ్డు గురునానక్ కాలనీ మెయిన్ రోడ్ లో ఉన్న గుంతలను త్వరగా పూడ్చాలని అధికారులను ఆదేశించారు. తదుపరి పటమట హై స్కూల్ రోడ్లో ఉన్న అన్న క్యాంటీన్ ను పరిశీలించి అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించేందుకు మొక్కలను నాటి హరితాన్ని పెంచాలని డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్ ని ఆదేశించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్ కే షమ్మీ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు చంద్రశేఖర్, సామ్రాజ్యం, సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News