విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డిసెంబర్ 10, 2025 న జరిగే కౌన్సిల్ ఎజెండా పై నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి విజయవాడ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో గల తమ చాంబర్లో శుక్రవారం ఉదయం శాఖాధిపతులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో కౌన్సిల్ ఎజెండా, అడిషనల్ ఎజెండా ఉన్న ప్రతిపాదనలను శాఖధిపతులతో చర్చించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ నగరాభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం సభ్యులు ఇచ్చిన ప్రతిపాదనలను అధికారులు అందరూ సహకరించాలని, ప్రజల కోసం విజయవాడ నగరపాలక సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉండాలని అన్నారు.
ఈ సమావేశంలో సెక్రటరీ ఇంచార్జి కె. ప్రభుదాస్, చీఫ్ ఇంజనీర్ i/c పి. సత్యకుమారి, డిప్యూటీ కమిషనర్ (రెవెన్యూ) జి సృజన, ఎస్టేట్ ఆఫీసర్ ఎ శ్రీధర్, సూపరిండెంటింగ్ ఇంజనీర్ i/c శ్రీనివాస్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, చంద్రశేఖర్, ప్రభాకర్, శ్రీనివాస్, సురేఖ, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ చక్రవర్తి, అకౌంట్స్ ఆఫీసర్ బి సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ కమిషనర్ డీ ఎస్ ఎస్ శ్రీనివాస్, బయాలజిస్ట్ కామేశ్వరరావు , వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ బి సోమశేఖర్ రెడ్డి, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ చంద్రశేఖర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News