Breaking News

ఎర్త్ సమ్మిట్–2025లో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
అహ్మదాబాద్‌లో ఎర్త్ సమ్మిట్–2025లో ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు మరియు ఇతర డిసిసిబి చైర్మన్ తో కలిసి పాల్గొన్న మాజీమంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు.

కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర సహకార శాఖ & హోం శాఖ మంత్రి అమిత్ షా, రూరల్ కోఆపరేటివ్ రంగ అభివృద్ధిపై ప్రసంగం చేశారు. అహ్మదాబాద్‌ గాంధీనగర్‌లోని మహాత్మా మందిర్ కన్వెన్షన్ అండ్ ఎగ్జిబిషన్ సెంటర్‌లో IAMAI మరియు NABARD సంయుక్తంగా నిర్వహించిన జాతీయ స్థాయి ఎర్త్ సమ్మిట్ – “Empowering Agriculture Rural Tech & Humanity” కార్యక్రమంలో మాజీమంత్రి కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం పాల్గొన్నారు.

సమ్మిట్ సందర్భంగా NCUI & IFFCO చైర్మన్ దిలీప్ సంఘాని మరియు NABARD చైర్మన్ షాజీ కెవి తో కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం రఘురాం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కోఆపరేటివ్ బ్యాంకింగ్ భవిష్యత్తు, రైతు సాధికారత, నూతన రూరల్ టెక్ విధానాలపై కీలక చర్చలు జరిగాయి.

ఈ కార్యక్రమంలో గుంటూరు DCCB చైర్మన్ ఎం. మల్లిఖార్జున రావు, నెల్లూరు DCCB చైర్మన్ ఎం. ధనంజయరెడ్డి, అనంతపురం DCCB చైర్మన్ ఎం. కేశవరెడ్డి విశాఖపట్నం DCCB చైర్మన్ కె. తాతారావు, కడప DCCB చైర్మన్ ఎం. సూర్యనారాయణ రెడ్డి, మరియు APCOB సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *