-పార్వతీపురం మన్యం జిల్లాలో ముఖ్యమంత్రి చంద్రబాబు
-పల్నాడు జిల్లాలో ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
-రాష్ట్ర వ్యాప్తంగా పాల్గొన్న దాదాపు 74 లక్షల మంది విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, ప్రజాప్రతినిధులు, దాతలు తదితరులు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో డిసెంబర్ 5న ‘మెగా పీటీఎం 3.0’ కార్యక్రమం అత్యంత వైభవంగా, విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్రంలో విద్యా ప్రమాణాల పెంపు, పాఠశాల-తల్లిదండ్రుల బంధాన్ని మరింత బలోపేతం చేయడానికి ఒక మైలురాయిగా నిలిచింది.
రాష్ట్రవ్యాప్తంగా 45,074 పాఠశాలలు, 475 జూనియర్ కళాశాలల్లో జరిగిన ఈ కార్యక్రమానికి మంత్రులు, జిల్లా స్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులు, పూర్వ విద్యార్థులు, దాతలు, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు సుమారు 74 లక్షల మంది పాల్గొన్నారు.
గ్యారెంటీడ్ ఎఫ్ఎల్ఎన్ లక్ష్యంగా…
Foundational Learning and Numeracy (FLN) ప్రధాన లక్ష్యంగా మెగా PTM 3.0 కార్యక్రమం నిర్వహించారు. ప్రతి ప్రాథమిక పాఠశాల విద్యార్థి చదవడం, రాయడం, లెక్కపెట్టడం (FLN)లో హామీ సాధించాలనే లక్ష్యాన్ని పెట్టుకున్నారు. FLN బేస్‌లైన్ అసెస్‌మెంట్ గురించి, హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డు, అసెస్‌మెంట్ బుక్ లెట్ గురించి తల్లిదండ్రులకు వివరించారు. ఆర్ట్ & క్రాఫ్ట్, సైన్స్ ప్రాజెక్టులు, FLN లెర్నింగ్ కిట్లు ప్రదర్శించారు. విద్యార్థులు అధ్యయన పురోగతి, హాజరు శాతం, క్రమశిక్షణ వంటి ముఖ్య అంశాలపై ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు నేరుగా చర్చించారు.
ప్రధాన సభ పార్వతీపురం మన్యం జిల్లా భామినిలో..
* మెగా పీటీఎం 3.0 కార్యక్రమంలో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లా భామిని ఏపీ మోడల్ స్కూల్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్, మానవనరుల అభివృద్ధి కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయ్ రామరాజు. వి, సమగ్ర శిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు, పాలకొండ నియోజకవర్గ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ, పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
పల్నాడు జిల్లాలో పవన్ కళ్యాణ్
పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో శారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ హాజరయ్యారు.
Prajavartha Online Telugu News