Breaking News

అధికారులు, బిఎల్ఓలకు అభినందనలు

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)లో భాగంగా ఎలక్ట్రోల్ మ్యాపింగ్ విషయంలో రాష్ట్రంలోని ఇతర అర్బన్ నియోజకవర్గాలతో పోలిస్తే 95 గుంటూరు తూర్పు, 94 పశ్చిమ నియోజకవర్గాల్లో 40 శాతంకి పైగా మ్యాపింగ్ చేసినందుకు రాజకీయ పార్టీల ప్రతినిధులు ప్రత్యేకంగా అధికారులు, బిఎల్ఓలకు అభినందనలు తెలిపారన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం ఈఆర్ఓ, అదనపు కమిషనర్ చల్లా ఓబులేసు తెలిపారు. బుధవారం జిఎంసి ప్రధాన కార్యాలయంలోని అదనపు కమిషనర్ చాంబర్ లో రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా అదనపు కమిషనర్ మాట్లాడుతూ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు పోలింగ్ కేంద్రాల వారీగా బూత్ లెవల్ ఏజంట్లను నియమించుకొని వివరాలను తమకు అందించాలని కోరారు. స్పెషల్ ఇన్సేంటివ్ రివిజన్ పై జరిగే సర్వేని రాజకీయ పార్టీల ప్రతినిధులు కూడా పరిశీలించి, సర్వే వేగవంతానికి సహకరించాలన్నారు.
సమావేశంలో జిఎంసి డిప్యూటీ సిటి ప్లానర్ సూరజ్ కుమార్, ఎన్.ఓంకార్ (తెలుగు దేశం), హెచ్.రామకృష్ణ (బిజెపి), డి.జాన్ బాబు (వైఎస్ఆర్సీపీ), బి.సునీల్ కుమార్ (ఇండియన్ నేషనల్ కాంగ్రెస్), తాతా సేవా కుమార్ (అమ్ ఆద్మీ పార్టి), ఎన్నికల విభాగం సూపరిండెంట్ బాలాజీ బాష, డిప్యూటీ తహసీల్దార్ నాగ మల్లేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *