Breaking News

పట్టణ ప్రణాళిక విభాగ సమీక్షా సమావేశం

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర ప్రభుత్వం అందరికి ఆమోదయోగ్యంగా ఉండేలా బి.పి.యస్, యల్.ఆర్.యస్, మీడియా డివైస్ పాలసిల పై జారీ చేసిన మార్గదర్శకాలపై నగర ప్రజలకు అవగాహన కలిగించాలని మేయర్ కోవెలమూడి రవీంద్ర పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులకు తెలిపారు. బుధవారం నగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో నగర కమిషనర్ పులి శ్రీనివాసులు నిర్వహించిన పట్టణ ప్రణాళిక విభాగ సమీక్షా సమావేశంలో మేయర్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన బి.పి.యస్, యల్.ఆర్.యస్ లను నగర ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అలాగే మీడియా డిస్ప్లే డివైస్ బోర్డు లపై రూపొందించిన మార్గదర్శకాల వలన నగర సుందరీకరణతో పాటు అనధికారిక హోర్డింగ్స్ కూడా లేకుండా ఉంటాయన్నారు. ప్రభుత్వ ఆదేశాలను క్షేత్రస్తాయిలో అధికారులు కార్యదర్శులు పటిష్టంగా అమలు చేయాలన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ, పట్టణ ప్రణాళిక విభాగం ప్రస్తుతం బి.పి.యస్, యల్.ఆర్.యస్, మీడియా డివైస్ ల రెగ్యులరైజేషన్లను ప్రాధాన్యతా అంశాలుగా విధులు నిర్వహించాలన్నారు. గుంటూరు నగర పాలక సంస్థ పరిధిలో బి.పి.యస్ పై సందేహాల నివృత్తి కై పట్టణ ప్రాణాలికా విభాగంలో ఏర్పాటు చేసిన హెల్ప్ డెస్క్ (8096084343 విజయరామరాజు) కు కార్యాలయ సమయంలో ఫోన్ చేసి తెలుస్కోవచ్చునన్నారు. యల్.ఆర్.యస్ లకు సంబంధించి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించుటతో పాటు ఉన్నతాధికారులకు పంపే ముందు క్షేత్ర స్తాయిలో సమగ్రంగా పరిశీలించాలన్నారు. నగరంలో జరుగుతున్నఇంటింటి సర్వేలో ఇప్పటివరకు 2352 భవనాలు బి.పి.యస్ కు దరఖాస్తు చేసుకోవాలని గుర్తించామని, భవన యజమానులు దరఖాస్తు చేసుకొనేలా అవగాహన కలిగించాలన్నారు. ప్రతి సెక్రటరీ బి.పి.యస్ దరఖాస్తుల పై రిజిస్టర్ నిర్వహించాలని, సర్వే సమయంలోనే ప్రతి ఇంటికి బి.పి.యస్ పై రూపొందించిన కరపత్రంతో పాటు గుర్తించిన వాటికి నోటీసు లు జారీ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ రెగ్యులేషన్ అండ్ కంట్రోల్ ఆఫ్ డిస్ప్లే డివైసెస్ రూల్స్ – 2025 మేరకు నగరంలో బోర్డు లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. సచివాలయం పరిధిలో ప్రస్తుతం మొత్తం ఉన్న బోర్డు లు, వాటిలో అనుమతి, అనుమతి లేని బోర్డు ల వివరాలు అందించాలన్నారు. అనధికారిక బోర్డు ల తొలగింపు నిరంతర ప్రక్రియగా ఉండాలని, ఈ నెల 15 లోపు బకాయిలు, నెలాఖరు లోపు ప్రస్తుత డిమాండ్ ఫీజులు చెల్లించాలన్నారు. అననతరం బి.పి.యస్ పై రూపొందించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
సమావేశంలో సి.పి రాంబాబు, డి.సి.పి సూరజ్ కుమార్, ఏ.సి.పి లు, టి.పి.యస్ లు, కార్యదర్శులు పాల్గోన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *