విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మచిలీపట్నం నుండి అజ్మీర్‌కు వెళ్లే భక్తుల సౌకర్యార్థం ప్రత్యేక రైలును ఏర్పాటు చేసినందుకు గాను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, మంత్రి కొల్లు రవీంద్ర కి, పార్లమెంట్ సభ్యులు బాలశౌరి వల్లభనేని కి, మరియు ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ హసీమ్ బేగ్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. అజ్మీర్ షరీఫ్ ఉర్స్ సందర్భంగా రాష్ట్రం నలుమూలల నుంచి, ముఖ్యంగా మచిలీపట్నం మరియు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రయాణించనున్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ ప్రత్యేక రైలును ఏర్పాటు చేయడం ప్రశంసనీయం. ఈ సౌకర్యం వల్ల వేలాది మంది భక్తులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణం లభించనుంది. ముఖ్యమంత్రి దూరదృష్టి నాయకత్వంలో, ప్రజాప్రతినిధులు మరియు సంబంధిత అధికారుల సమన్వయంతో ఈ సేవ అందించడం ద్వారా ప్రభుత్వం మత సామరస్యానికి, మైనారిటీ సంక్షేమానికి ఇస్తున్న ప్రాధాన్యత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రత్యేక రైలు ఏర్పాటు చేయడంలో సహకరించిన అందరికీ భక్తుల తరఫున, అలాగే మచిలీపట్నం కూటమి మైనారిటీ తరఫున డాక్టర్ హసీమ్ బేగ్ మరోసారి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జామియా మసీదు ప్రెసిడెంట్ భాషా, సయ్యద్ ఖాజా, ఫిరోజ్, బాజాని, అజీమ్, ఖాదర్, గడ్డం రాజు, పాషి మరియు కూటమి మైనార్టీలు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News